Site icon NTV Telugu

IND vs PAK: ఫిబ్రవరి 12న బంగ్లాలో ఎన్నికలు.. భారత్తో మ్యాచ్పై పాక్ యూ టర్న్.. ఆ రోజే తెలుస్తుంది!

Ind

Ind

IND vs PAK: భారత్ -పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు ఇటీవలి కాలంలో తీవ్రంగా దిగజారాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన గ్రూప్ దశ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం తమ జట్టుకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది.

Read Also: IND vs PAK Warm-up Matches: T20 ప్రపంచ కప్ వివాదం.. నేడు భారత్- పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్‌లు

అయితే, ఐసీసీ వరల్డ్ టీ20 2026లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనుమతి ఇస్తున్నాం.. కానీ, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో తమ జట్టు మైదానంలోకి దిగటం లేదని చెప్పుకొచ్చింది. ఇక, ఈ నిర్ణయానికి గల కారణాన్ని దాయాది దేశం అధికారికంగా వెల్లడించలేదు. కానీ, భారత్‌కు రావడానికి నిరాకరించడంతో బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించి, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చడంపై పాకిస్తాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపిస్తోంది.

యూ-టర్న్ తీసుకునే అవకాశం ఉందా?
ఇక, ఫిబ్రవరి 12వ తేదీన బంగ్లాదేశ్‌లో జరగనున్న సాధారణ ఎన్నికల అనంతరం పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకునే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (పీసీబీ) బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత బహిష్కరణపై యూ-టర్న్ తీసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాగా, నఖ్వీ ఒక క్రికెట్ నిర్వాహకుడి కన్నా రాజకీయ నాయకుడిగానే ఎక్కువగా పని చేస్తున్నారు.. ఫిబ్రవరి 12న ఎన్నికలు పూర్తయిన తర్వాత, ఫిబ్రవరి 15 మ్యాచ్‌కు మరో రెండు రోజులు సమయం ఉంటుంది.. ఆలోపు పరిస్థితులు పూర్తిగా మారవచ్చు.. లేదంటే, పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Read Also: Baby Bathing Tips: పసిపిల్లలకు స్నానం ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి..?

బ్రాడ్‌కాస్టర్లకు నష్టాలు.. కోర్టుకు వెళ్లే ఛాన్స్
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే భారీ ఆర్థిక నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోహాట్‌స్టార్ (JioHotstar) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), ఐసీసీపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీ నాలుగేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, అందులో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లు కీలక భాగంగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఆ మ్యాచ్‌ల ఆధారంగానే బ్రాడ్‌కాస్టర్ భారీ మొత్తంలో చెల్లింపులు చేశాడని తెలిపాయి. కాబట్టి మ్యాచ్ జరగకపోతే ఇది ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించి కోర్టును ఆశ్రయించే హక్కు బ్రాడ్‌కాస్టర్‌కు ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, ఈ విషయంలో మద్దతు కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇతర సభ్య బోర్డులను సంప్రదించినప్పటికీ, ఎవరూ సపోర్టు ఇవ్వలేదు. ఈ పరిణామాలతో టీ20 వరల్డ్ కప్ 2026లో మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. అయితే, భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Exit mobile version