Azmatullah Omarzai: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. రెండో చెత్త బౌలర్‌గా ఒమర్జాయ్ రికార్డు!
- ఒకే ఓవర్‌లో 36 పరుగులు
- ఒమర్జాయ్ ఖాతాలో చెత్త రికార్డు
- అగ్రస్ధానంలో స్టువర్ట్ బ్రాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Azmatullah Omarzai created an unwanted record T20 World Cup: అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 36 రన్స్ ఇచ్చుకున్నాడు. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ దెబ్బకు ఒమర్జాయ్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది.
విండీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను అజ్మతుల్లా ఒమర్జాయ్ వేయగా.. నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 36 పరుగులు రాబట్టుకున్నాడు. మొదటి బంతిని సిక్సర్‌గా బాదిన పూరన్.. రెండో బంతిని బౌండరీకి తరలించాడు. అయితే అది నోబాల్ కాగా.. ఫ్రీహిట్‌ను భారీ వైడ్‌గా వేయడంతో అది బౌండరీకి వెళ్ళింది. తర్వాత వేసిన ఫ్రీహిట్ బాల్‌కు పరుగులేమి రాలేదు. అయితే మూడో బంతికి లెగ్‌బై రూపంలో బౌండరీ లభించింది. నాలుగొ బంతి ఫోర్ కాగా.. అయిదో బంతి సిక్సర్‌గా వెళ్ళింది. ఇక ఆఖరి బంతి కూడా సిక్సర్ వెళ్లడంతో ఏకంగా 36 పరుగులు వచ్చాయి.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Fastest Century: 27 బంతుల్లోనే సెంచరీ.. క్రిస్ గేల్ ‘ఆల్‌టైమ్’ రికార్డు బ్రేక్!
టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 36 పరుగులు పిండుకున్నాడు. యువీ ఆరు బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 36 పరుగులు వచ్చాయి. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఎక్స్‌ట్రాస్ రూపంలో 10 పరుగులు సమర్పించుకున్నాడు.
తాజావార్తలు
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!