Site icon NTV Telugu

Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్కి స్టార్ బౌలర్ దూరం

Josh

Josh

Josh Hazlewood: రేపటి నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నమెంట్ కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో ప్రస్తుతం ఎవరినీ భర్తీ చేయడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన చేసింది. గాయం నుంచి కోలుకుని టోర్నమెంట్ మధ్యలో జట్టులో చేరతాడు అనే ఆశలు ఉన్నప్పటికీ, తాజా మెడికల్ రిపోర్ట్స్ ఆ అవకాశాన్ని నిరాకరించాయి.

Read Also: Supreme Court: ప్రశాంత్ కిషోర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ తీరుపై చీవాట్లు

కాగా, ఈ విషయంపై సెలక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.. సూపర్- 8 దశ నాటికి హేజిల్‌వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని మేం అనుకున్నాం.. కానీ తాజా పరిస్థితుల ప్రకారం అతడు కోలుకోవడానికి ఇంకా కొంత టైం పడుతుంది అన్నారు. అతడిని తొందరపెట్టి మైదానంలోకి దింపడం ప్రమాదకరం అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జట్టుతోనే ప్రారంభ మ్యాచ్‌లు ఆడగలం అనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. అవసరం ఉంటే మాత్రమే రీప్లేస్‌మెంట్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని టోనీ డోడెమైడ్ తేల్చి చెప్పారు. ఇక, ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 11వ తేదీన ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తమ మొదటి నాలుగు మ్యాచ్‌లను శ్రీలంకలోని పల్లెకెలె, కొలంబో వేదికలలో ఆడనుంది.

Read Also: 47% డిస్కౌంట్‌, 4K సపోర్టుతో Portronics Beem 510 స్మార్ట్ ప్రొజెక్టర్.. అమెజాన్‌ వరల్డ్ కప్ సేల్ స్పెషల్

అయితే, టీ20 ప్రపంచకప్ 2026 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీన అట్టహాసంగా స్టార్ట్ కానున్న ఈ మెగా టోర్నమెంట్, మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈసారి ప్రపంచకప్ టైటిల్ కోసం మొత్తం 20 జట్లు బరిలో ఉండగా, 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Exit mobile version