Anirudh Ravichander: క్రికెట్, సంగీతం కలిసే అరుదైన వేడుకకు చెన్నై సిద్ధమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్ ICC అధికారిక ఈవెంట్ సాంగ్ “Feel the Thrill”ను ఫిబ్రవరి 26న చెన్నైలోని ప్రసిద్ధ MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో లైవ్‌గా ప్రదర్శించనున్నారు. ఇండియా – జింబాబ్వే మ్యాచ్‌కు ముందు ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరగనుంది.
మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..!
ఈ T20 టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం కొనసాగుతుండగా.. అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్‌కు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. తన ఎనర్జిటిక్ మ్యూజిక్, స్టేజ్ ప్రెజెన్స్‌తో ప్రసిద్ధి చెందిన అనిరుధ్ ఈ అధికారిక గీతాన్ని స్వయంగా కంపోజ్ చేసి పాడారు. దీంతో ఈ సాంగ్ ICC ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “Feel the Thrill” పాట T20 క్రికెట్ ను ప్రతిబింబించేలా రూపొందించబడింది. దేశభక్తి, క్రికెట్‌పై అభిమానుల అభిమానం, ఆటలోని భావోద్వేగాలను ఈ పాట ప్రతిబింబిస్తుంది.
Thunderstorms Alert : అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఈ పాట ICC చేపట్టిన పెద్ద ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించబడింది. ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశ్యం దేశాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, క్రికెట్ ప్రపంచాన్ని ఒకటిగా కలుపుతుందనే సందేశాన్ని ఇవ్వడం. అభిమానులు కేవలం మ్యాచ్‌ను చూడటం మాత్రమే కాదు, ప్రతి క్షణాన్ని అనుభవిస్తారని ఈ పాట తెలియజేస్తుంది. ఈ సాంగ్ గురించి అనిరుధ్ మాట్లాడుతూ.. క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఒకే భావోద్వేగాన్ని కలిగిస్తుందని అన్నారు. “ప్రతి చీర్, ప్రతి నిశ్శబ్దం, ప్రతి హార్ట్ బీట్ క్రికెట్ సమయంలో ఒకే రీతిలో కలుస్తాయి” అని అన్నారు. ఈ ఐసీసీ అధికారిక పాటతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
Anirudh to perform tomorrow at the Chepauk. pic.twitter.com/PydJ1nTShA
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2026
