Site icon NTV Telugu

Team India: నేటి రాత్రికి భారత్కు టీమిండియా ప్లేయర్స్..

Team India

Team India

Team India: బార్బడోస్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా క్రికెట్ జట్టు ఈరోజు అర్థరాత్రి వరకు భారతదేశానికి చేరుకోనుంది. ఇండియాకు వచ్చిన తర్వాత టీమిండియా క్రికెట్ బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత, 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ముంబైలో భారత జట్టు ప్లేయర్లు ఓపెన్ బస్సులో పరేడ్ చేయనున్నట్లు సమాచారం. ఇక, టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ రెండోసారి గెలుచుకుంది. 2007లో టైటిల్‌ను గెలుచుకున్న టీమ్.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2024లో టైటిల్‌ను సాధించింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలిచినప్పుడు.. మొత్తం జట్టును ఓపెన్ బస్సులో ముంబై నగరంలో తిప్పారు. ఆ సమయంలో వేలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ వారికి ఆపూర్వ మద్దతు ఇచ్చారు.

Read Also: Minister Kandula Durgesh: టూరిజం రంగానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కల్యాణ్.. మరొకరు అవసరంలేదు..

ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ముంబైలో ఓపెన్ బస్సులో టీమిండియా ప్లేయర్స్ చక్కర్లు కొట్టనున్నారు అని సమాచారం. అయితే, బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా.. రోహిత్ సేన అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడింది. తుఫాన్ ఎఫెక్ట్ తో బార్బడోస్‌లోని విమానాశ్రయం మూసివేశారు. దీని కారణంగా ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది, అధికారులు అందరూ అక్కడ చిక్కుకున్నారు. ఆ తర్వాత బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు, వారి కుటుంబాలు భారతదేశానికి తిరిగి ఈరోజు అర్థరాత్రి 1 గంట తర్వాత చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత బృందం రేపు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలివనున్నారు.

Exit mobile version