Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన మహిళా ఫ్యాన్.. కారణం ఏంటంటే?
- కెప్టెన్సీ విషయంలో తీవ్ర విమర్శలు
- 144 పరుగులు 11 వికెట్లు
- హార్దిక్‌కు బహిరంగ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Female Fan Apologises To Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాకుండా.. కెప్టెన్‌గా కూడా తేలిపోయాడు. దాంతో హార్దిక్‌పై ముంబై ఇండియన్స్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని భారత్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్ ఓవర్‌లో 16 పరుగులను డిఫెండ్ చేసి.. భారత్‌కు 7 రన్స్ తేడాతో కప్‌ను అందించాడు. ప్రస్తుతం హార్దిక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ట్రోల్ చేసిన ఓ మహిళా అభిమాని హార్దిక్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
Also Read: Kubera: ‘కుబేర’ నుంచి రష్మిక వీడియో వచ్చేసింది.. వామ్మో గొయ్యి తవ్వి మరీ..!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
తాను చేసిన ట్రోలింగ్‌కు హార్దిక్ పాండ్యాను సారీ అడుగుతున్నా అంటూ సదరు మహిళా అభిమాని ఓ పోస్ట్ చేశారు. ‘ముందుగా నేను హార్దిక్ పాండ్యాకు క్షమాపణలు చెబుతున్నా. గతంలో నేను చేసిన ట్రోలింగ్‌కు సారీ అడుగుతున్నా. నేను ఎందుకు హార్దిక్‌ను ట్రోల్ చేశానో తెలియదు. మరోసారి సారీ చెబుతున్నా. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో హార్దిక్ చివరి ఓవర్ చిరకాలం గుర్తుండిపోతుంది. మీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి’ అని మహిళా అభిమాని ఓ జాతీయ మీడియా లైవ్ ఇంటరాక్షన్ సందర్భంగా పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ 144 పరుగులు, 11 వికెట్లు తీశాడు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!