T20 World Cup Fastest Fifties: టీ20 వరల్డ్‌కప్‌లలో ‘యువరాజ్’ సింగ్.. ఆల్ టీమ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్ ఇదే!
- షిమ్రాన్ హెట్‌మయర్ సంచలన ప్రదర్శన
- 19 బంతుల్లోనే హెట్‌మయర్ అర్ధ శతకం
- ఆల్ టీమ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్ ఇదే
T20 World Cup Fastest Fifties List: టీ20 ప్రపంచకప్ 2026లో కరీబియన్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మయర్ సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. సూపర్-8లో భాగంగా సోమవారం ముంబైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. దాంతో టీ20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హెట్‌మయర్ దూకుడు ఇన్నింగ్స్ కారణంగా వెస్టిండీస్ జట్టు భారీ తేడాతో గెలిచి.. గ్రూప్-1 నుంచి సెమీస్ రేసులో ముందంజలో నిలిచింది.
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ప్రతి జట్టు తరఫున వేగవంతమైన ఫిఫ్టీల జాబితాను ఓసారి చూద్దాం. భారత తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాడు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. 2007లో ఇంగ్లాండ్‌పై కేవలం 12 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఆస్ట్రేలియా తరఫున మార్కస్ స్టోయినిస్ 2022లో 17 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. , పాకిస్తాన్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ 18 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు.
Also Read
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
- Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
- Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
శ్రీలంక తరఫున 2026లో ఒమాన్‌పై దాసున్ శనక 19 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ న్యూజిలాండ్‌పై 19 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. బంగ్లాదేశ్ తరఫున 2007లో మహమ్మద్ అష్రాఫుల్ 20 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేయగా.. జింబాబ్వే బ్యాటర్ ఎల్టన్ చిగుంబురా 21 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరఫున 2026లో ఇటలీపై విల్ జాక్స్ 21 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు. న్యూజిలాండ్‌కు గ్లెన్ ఫిలిప్స్ 22 బంతుల్లో ఫిఫ్టీ చేయగా.. అఫ్గానిస్తాన్ తరఫున షఫీఖుల్లా 2014లో 24 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.
Also Read: West Indies Biggest Wins: వెస్టిండీస్ భారీ విజయాల చరిత్ర.. టాప్-5 రికార్డులన్నీ వరల్డ్‌కప్‌ల్లోనే!
ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్:
12 బంతులు – యువరాజ్ vs ENG, 2007
17 బంతులు – మైబర్గ్ vs IRE, 2014
17 బంతులు – స్టోయినిస్ vs SL, 2022
18 బంతులు – మాలిక్ vs SCO, 2021
19 బంతులు – షనక vs OMA, 2026
19 బంతులు – మార్క్రామ్ vs NZ, 2026
19 బంతులు – హెట్మైర్ vs ZIM, 2026
20 బంతులు – అష్రఫుల్ vs WI, 2007
21 బంతులు – చిగుంబురా vs UAE, 2014
21 బంతులు – విల్ జాక్స్ vs ITA, 2026
22 బంతులు – జోన్స్ vs CAN, 2024
22 బంతులు – బెన్ మనేంటి vs ENG, 2026
22 బంతులు – గ్లెన్ ఫిలిప్స్ vs CAN, 2026
24 బంతులు – షఫీకుల్లా vs HNG, 2014
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!