Australia Cricket History: ఈసారి వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే.. ఈ గణాంకాలు చూస్తే మీరు కూడా నిజమే అంటారు!
- ఆస్ట్రేలియా యుద్ధానికి సిద్ధమవుతోందని చరిత్రే చెబుతోంది
- సిరీస్‌లు ఓడినప్పుడల్లా ఆసీస్ ట్రోఫీ కొడుతోంది
- ఈసారి వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రపంచంలో కొన్ని జట్లు ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆది నుంచి క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా ఇప్పటికే ఎన్నో కప్పులు గెలిచింది. అయితే ఆసీస్ ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు కానీ.. మెగా టోర్నీ మూడు ఆ జట్టు ఓడడం మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఐసీసీ టోర్నీల ముందు సిరీస్‌లు ఓడినప్పుడల్లా.. ట్రోఫీ కొడుతోంది. ఆసీస్ సిరీస్ ఓడితే బలహీనపడిందని కాదు.. యుద్ధానికి సిద్ధమవుతోందని చరిత్రే చెబుతోంది. ఆ గణాంకాలు ఓసారి చూద్దాం.
2007 వరల్డ్ కప్:
2007 వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల ఫామ్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ వరల్డ్ కప్ వచ్చేసరికి కథ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్‌కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
2021 టీ20 వరల్డ్ కప్:
2021 టీ20 వరల్డ్ కప్‌కు ముందు కూడా ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో పరాజయం పాలైంది. ఈ టీమ్‌కు టీ20లు సూటవ్వవు అన్న మాటలు వినిపించాయి. కానీ టోర్నీలో అడుగుపెట్టిన తర్వాత ఆసీస్ పూర్తిగా మారి మొదటిసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.
2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్:
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. అయినా ఫైనల్‌లో మాత్రం క్లాస్ చూపించింది. అనుభవం, మెంటల్ స్ట్రెంగ్త్‌తో ప్రత్యర్థిని దెబ్బతీసి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ మేస్‌ను సొంతం చేసుకుంది.
2023 వన్డే వరల్డ్ కప్:
2023 వన్డే వరల్డ్ కప్‌కు ముందు కూడా ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను ఓడిపోయింది. కానీ వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత నెమ్మదిగా పుంజుకుని.. కీలక మ్యాచ్‌ల్లో అసలు ఆట చూపించి చివరికి వరల్డ్ కప్ ట్రోఫీని మళ్లీ ఎత్తుకుంది.
2026 టీ20 వరల్డ్ కప్:
ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా మరోసారి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఒక్క ప్రశ్న మెదులుతోంది. ఈసారి కూడా అదే స్టోరీ రిపీట్ అవుతుందా? అని. చరిత్రను చూస్తే ఆస్ట్రేలియా సిరీస్ ఓడినప్పుడల్లా బలహీనంగా కాకుండా.. టోర్నీ కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతోందన్న భావన బలంగా కనిపిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!