Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే….?
- టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్‌కు భారీ బహుమతి
- రన్నరప్, సెమీఫైనల్ జట్లకు ఐసీసీ ప్రైజ్ మనీ
- గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్లకు తక్కువ మొత్తం
- టీమ్ ఇండియాకు బీసీసీఐ నుంచి రూ.131 కోట్ల నజరానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prize Money : 2026 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుపై ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక బహుమతి నిధి (Prize Money) పంపిణీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం వెల్లడించింది. మొత్తం 11.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 103 కోట్లు) పూల్ నుండి జట్ల ప్రదర్శన ఆధారంగా నిధులను కేటాయించారు.
TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడిన టీమ్ ఇండియాకు ఐసీసీ నుండి మొత్తం 2.63 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 24.25 కోట్లు) లభించాయి. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచినందుకు లభించిన బోనస్‌లు, ఫైనల్ విజేతగా దక్కిన మొత్తం కలిపి భారత్ ఈ భారీ పారితోషికాన్ని అందుకుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 13.08 కోట్లు) దక్కాయి. సెమీఫైనల్ వరకు చేరిన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు వరుసగా రూ. 9.24 కోట్లు, రూ. 8.96 కోట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. మరోవైపు, గ్రూప్ దశలోనే వెనుదిరిగిన పాకిస్థాన్ జట్టుకు కేవలం రూ. 4.80 కోట్లు మాత్రమే లభించాయి.
ఐసీసీ అందించిన బహుమతి కంటే రెట్టింపు స్థాయిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచినందుకు గానూ టీమ్ ఇండియా ఆటగాళ్లు , సహాయక సిబ్బందికి కలిపి రూ. 131 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. భారత క్రికెట్ చరిత్రలో ఒక జట్టుకు ప్రకటించిన అత్యధిక బహుమతి మొత్తం ఇదే కావడం గమనార్హం. కేవలం ఆటగాళ్లకే కాకుండా, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఈ మొత్తంలో భాగం ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ భారీ ప్రోత్సాహకాలతో భారత క్రికెట్ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Cargo Ship Attacked: హార్ముజ్‌లో భారత్ వస్తున్న కార్గో షిప్‌పై అటాక్..
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!