Site icon NTV Telugu

T20 World Cup 2026: ఐసీసీ టోర్నీల్లో బహిష్కరణ మ్యాచ్‌లు.. లిస్టులో టాప్ టీమ్స్!

Icc Boycotted Matches

Icc Boycotted Matches

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే. కానీ భద్రతా సమస్యలు, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌లు జరగకుండానే బహిష్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్ కూడా అదే జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించగా.. పీసీబీ నుంచి ఐసీసీకి ఇంకా అధికారిక ప్రకటన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ టోర్నీల్లో జరిగిన బహిష్కరణ మ్యాచ్‌లపై ఓసారి లుక్కేద్దాం.

1996 వన్డే వరల్డ్‌కప్‌:
1996 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకలో ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు భద్రతా కారణాలతో బహిష్కరణకు గురయ్యాయి. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. అదే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ కూడా శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్‌ను భద్రతా సమస్యలను చూపిస్తూ బహిష్కరించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీలంకకు వాక్‌ ఓవర్ లభించింది. అప్పట్లో ఈ నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి.

2003 వన్డే వరల్డ్‌కప్‌:
2003 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లాండ్ భద్రతా, రాజకీయ కారణాలను పేర్కొంటూ బహిష్కరించింది. దాంతో ఆ మ్యాచ్‌లో జింబాబ్వేకు పాయింట్లు లభించాయి. అదే టోర్నీలో కెన్యాతో ఆడాల్సిన మ్యాచ్‌ను న్యూజిలాండ్ ఉగ్రవాద భయం కారణంగా ఆడలేదు. ఈ సంఘటనలు ఆ వరల్డ్‌కప్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.

Also Read: T20 World Cup 2026: పాకిస్థాన్‌కు డేంజర్ బెల్స్.. రెండు మ్యాచ్‌లు ఓడితే ఇంటికే!

2026 టీ20 వరల్డ్‌కప్‌:
ఇప్పుడు 2026 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్-భారత్ మ్యాచ్ కూడా బహిష్కరణ దిశగా సాగుతోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే.. ఐసీసీ టోర్నీల చరిత్రలో మరో వివాదాస్పద ఘటనగా ఈ మ్యాచ్ నమోదు అవుతుంది. క్రికెట్లో రాజకీయాలు, భద్రతా అంశాలు జోక్యంతో అభిమానులకు నిరాశే మిగిలింది. ఐసీసీ టోర్నీల్లో ఇలాంటి బహిష్కరణలు మళ్లీ జరగకుండా క్రీడా స్ఫూర్తి నిలబడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Exit mobile version