Surya Kumar Yadav: ప్రమాదంలో సూర్యకుమార్ యాదవ్ కెరీర్..? అదొక్కటే దారి..
- మిస్టర్ 360 కెరీర్ ప్రమాదంలోకి..?
- వరుసగా ఫేలవ ప్రదర్శన..
- వచ్చే సిరీస్‌లే కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన, క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. మైదానంలో నలుమూలలా షాట్లు కొడుతూ ‘మిస్టర్ 360’గా పేరు తెచ్చుకున్న సూర్య, ఇప్పుడు తన కెప్టెన్సీ, బ్యాటింగ్ ఫామ్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
సూర్యకుమార్ యాదవ్ కెరీర్ డైలమా..?
Also Read
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
- Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
- IND vs SL 1st Test: గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
- Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
2024 జూలైలో భారత టీ20 జట్టు పగ్గాలను చేపట్టిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. సాధారణంగా విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన ఆయన, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కీలకమైన మ్యాచుల్లో ఆయన తడబడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సూర్య డకౌట్ కావడం ఆయన కెరీర్‌పై పెద్ద మచ్చగా మిగిలిపోయింది. పరుగులు చేయకపోవడమే కాకుండా.. తన సహజ సిద్ధమైన స్ట్రైక్ రేట్‌ను కూడా ఆయన కొనసాగించలేకపోయారు. కెప్టెన్ ముందుండి జట్టును నడిపించాల్సిన సమయంలో.. వరుసగా విఫలం కావడంతో జట్టు మేనేజ్మెంట్ పునరాలోచనలో పడింది.
Also Read:Gold Income: ఒక్క గ్రాము బంగారంపై రూ.11,221 లాభం.. ఆర్బీఐ కీలక ప్రకటన..
త్వరలో ఐర్లాండ్ , ఇంగ్లండ్‌లతో జరగనున్న 7 టీ20 మ్యాచ్‌లు సూర్య భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఈ సిరీస్‌లు ఆయన కెరీర్‌కు ‘డూ ఆర్ డై’ వంటివి. ఇందులో బ్యాటర్‌గా భారీ పరుగులు సాధించడంతో పాటు.. కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కూడా విఫలమైతే.. టీ20 స్క్వాడ్‌లో ఆయన స్థానంపై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గంభీర్ మద్దతు..
ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి సూర్యకు పూర్తి మద్దతు లభిస్తోంది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గంభీర్, సూర్యను వెనకేసుకొస్తున్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం ఫలితాలకే ప్రాధాన్యత ఇస్తోంది. 2028 ఒలింపిక్స్ .. తదుపరి వరల్డ్ కప్ నాటికి జట్టును సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బోర్డు, అప్పటి వరకు సూర్య కొనసాగాలంటే ఈ పర్యటనలో కచ్చితంగా సత్తా చాటాలని స్పష్టం చేసింది.
యువ ఆటగాళ్లు పోటీపడుతున్న తరుణంలో.. సూర్యకుమార్ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుని, విమర్శకుల నోళ్లు మూయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భారత టీ20 చరిత్రలో ఒక వెలుగు వెలిగిన స్టార్ ప్లేయర్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!