న్యూజిలాండ్‌తో లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. అయితే తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు విజయాన్ని అందించాడు. సూర్య అంటే 360 డిగ్రీ ప్లేయర్ అని తెలుసు. బంతి పడితే చాలు అది బౌండరీ అవతల పడుతుందనే అనుకునే వారు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అతడు తన ఆటతీరుకు పూర్తి విరుద్ధంగా ఆడాడు. 31 బాల్స్ లో 26 రన్స్ చేశాడు. కానీ టీమ్ విజయంలో ఈ పరుగులే అత్యధికం తన ఈ కొత్త బ్యాటింగ్ స్టైల్‌పై మ్యాచ్ తర్వాత సూర్య స్పందించాడు. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌తో కలిసి సరదాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు సూర్య. టీమ్‌లో అందరితో సరదాగా ఉండే చాహల్.. తనదైన రీతిలో సూర్యను ప్రశ్నలు అడిగాడు. వాటికి అతడు కూడా అంతే సరదాగా సమాధానాలు ఇచ్చాడు.
INDvsNZ T20: ఒక్క సిక్స్ కొట్టలే..ఇదేం మ్యాచ్‌రా బాబు
“మన మిస్టర్ 360 ఇవాళ చాలా ప్రశాంతంగా కనిపించాడు. అతనిలోని భిన్నమైన కోణాన్ని మనం ఇవాళ చూశాం. అతన్ని గత 11-12 ఏళ్లుగా చూస్తున్నా. సాధారణంగా 30 బాల్స్‌లో 70 రన్స్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో నీ మైండ్ సెట్ ఎలా ఉంది” అని సూర్యను చాహల్ అడిగాడు. దీనికి సూర్య సమాధానమిస్తూ.. “నా ఆటపై పూర్తి నమ్మకం ఉంది. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్తే గెలిపించవచ్చిన అనుకున్నాను. సుందర్ ఔటైన తర్వత హార్దిక్‌తోనూ అదే చెప్పాను” అని సూర్య చెప్పాడు. అయితే చాహల్ తర్వాత అడిగిన ప్రశ్నే అందరినీ నవ్వించింది. “నీకు 360 డిగ్రీల్లో ఆడటం నేర్పించాను. కానీ ఇది పూర్తిగా భిన్నమైన వికెట్. రంజీ ట్రోఫీలో నేను ఆడిన ఆట చూశావా” అని చాహల్ అడిగాడు. “నిజానికి నువ్వు నాకు గత సిరీస్‌లో నేర్పించింది గుర్తు పెట్టుకున్నాను. నాకు ఇంకా బ్యాటింగ్ పాఠాలు నేర్పితే నేను మరింత మెరుగవుతాను. వ్యూయర్స్.. దీనిని జోక్‌గా తీసుకోకండి. చాహల్ నా బ్యాటింగ్ కోచ్. అతడు నాకు అన్నీ నేర్పిస్తాడు” అని సూర్య నవ్వుతూ చెప్పాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్ గెలిచిన టీమిండియా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్‌లో జరగనుంది.