Suryakumar Yadav : ఒత్తిడి ఉంటుంది కానీ.. ఫ్యాన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా!

  • వాంఖడే స్టేడియంలో అమెరికాతో భారత్ మ్యాచ్‌
  • హోం గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదు
  • ప్రాక్టీస్ సెషన్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సూర్య
Suryakumar Yadav Comments

Suryakumar Yadav Comments

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్ తన ప్రయాణాన్ని అమెరికాతో ప్రారంభించబోతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. హోం గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదని అంగీకరించాడు. అయితే ఆ ఒత్తిడిని ఆస్వాదిస్తూ.. అభిమానులకు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామని హామీ ఇచ్చాడు. శుక్రవారం చివరి ప్రాక్టీస్ సెషన్‌కు ముందు సూర్య మీడియాతో మాట్లాడాడు.

‘హోం గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు అదనపు ప్రెషర్ ఉంటుంది. ఇది కచ్చితంగా అగీకరించాల్సిన విషయం. నిజాయతీగా చెప్పాలంటే నర్వస్, ఒత్తిడి ఉంటుంది. కానీ దీని పాజిటివ్ వైపు చూస్తే.. ఎంతో ఉత్సాహం ఉంటుంది. స్టేడియంలో 30 నుంచి 35 వేల మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తారు. కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తారు. వాళ్లందరికీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. మా కుర్రాళ్లకు ఇదే చెప్పా’ అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

Also Read: Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలి.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

ప్రపంచంలో నెంబర్‌వన్ టీ20 జట్టుగా ఉన్న భారత్ మెగా టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయినప్పటికీ ఏ జట్టునూ తేలికగా తీసుకోవడం లేదని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ‘టోర్నీలో బలహీనమైన జట్టు అంటూ ఏదీ లేదు. 20 జట్లు మంచి క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉన్నవే. పొట్టి ఫార్మాట్‌లో 1-2 బ్యాటర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పేయగలరు. లేదా ఒక బౌలర్ 24 బంతుల్లో గేమ్‌ను మార్చేయవచ్చు. అందుకే ప్రతి జట్టుతో ఒకే విధంగా ఆడాలి’ అని చెప్పాడు. యూఎస్‌ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సంజయ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ… ‘భారత్‌తో, అదీ ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఆడటం అమెరికా క్రికెట్‌కు గర్వకారణం. ఇది మా దేశంలో కొత్త తరం క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. అమెరికాతో జరిగే తొలి మ్యాచ్‌ నుంచే వరల్డ్‌కప్‌లో తన ఆధిపత్యాన్ని చాటాలని టీమిండియా ఆశిస్తోంది.