రేపు జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు ఆస్ట్రేలియా జట్టుతో పాటుగా న్యూజిలాండ్ జట్టు కూడా చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ జట్టు ఓ మార్పు చేస్తే బాగుంటుంది అని భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే సెమీస్ కి కివీస్ జట్టు ఇంగ్లాండ్ తో తలపడిన సమయంలో.. ఆ జట్టులోని ముఖ్య ఆటగాడు డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే కాదు… ఆ ఆతర్వాత భారత పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు అది కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లకు పెద్ద తలనొప్పిగా మారింది. దీని పై గవాస్కర్ మాట్లాడుతూ… డెవాన్ కాన్వే నాణ్యమైన ఆటగాడు కాబట్టి ఇది జట్టు పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి అతని స్థానంలో ఈ ఫైనల్ మ్యాచ్ లో జిమ్మీ నీషమ్‌ను పంపించాలని గవాస్కర్ సూచించాడు. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ విజయం సాధించడంలో నీషమ్ కీలక పాత్ర పోషించాడు. కాబట్టి నీషమ్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో పైకి తేవాలి. అతను బౌలర్ల దాడిని ఎలా తిప్పికోటగలడో మనం చూశాము అని గవాస్కర్ అన్నారు.