శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. శ్రీలంక బోర్డు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
Read Also: కోహ్లీ వందో టెస్టుపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే శ్రీలంక బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిట్‌నెస్ మార్గదర్శకాల కారణంగానే రాజపక్స రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. శ్రీలంక బోర్డు నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి. ఒకవేళ పరుగు పూర్తికాకపోతే వేతనాల్లో కోత పడనుంది. కాగా 2021 జూలైలో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రాజపక్స.. కేవలం ఆరు నెలలు మాత్రమే మాత్రమే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా తన కెరీర్‌లో 5 వన్డేలు, 18 టీ20లు ఆడి 409 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ లంక జట్టులోనూ రాజపక్స ఉన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 155 పరుగులు చేశాడు.