NTV Telugu Site icon

SL vs NZ: తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న లంక.. భారత్ ​కు ఊహించని షాక్‌..?

Sl Vs Nz

Sl Vs Nz

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగిస్తోంది. ఫస్ట్ బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ పరంగా కివీస్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన లంక బ్యాటర్లు.. ఇప్పుడు బౌలర్లు కూడా దుమ్ము రేపుతున్నారు. మరోవైపు, టీమ్ ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ క్రికెటర్లు అదరగొడుతున్నారు. దీంతో భారత్ అభిమానులు.. డబ్య్లూటీసీ ఫైనల్ బెర్త్ విషయంపై కాస్త ఆందోళన చెందుతున్నారు. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు కీలక వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. క్రీజులో డార్లీ మెచెల్(40), బ్రేస్ వేల్(9) పరుగులతో అజేయంగా ఉన్నారు. తొలుత బ్యాటింగ్ పరంగా కివీస్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక.. ఇప్పుడు బౌలర్లు కూడా దుమ్ము రేపుతున్నారు.

Also Read : Delhi Liquor Scam: ఢిల్లీలో హైటెన్షన్.. కేసీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులు

శ్రీలంక బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్ల విలవిలలాడుతున్నారు. కాగా శ్రీలంక తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 355 పరుగుల మెరుగైన స్కోర్ సాధించింది. లంక ఇన్నింగ్స్ లో కుశాల్ మెండిస్ (87) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ కరుణరత్నే (50), ఏజెంల్ మాథ్యూస్(47), ధనుంజయ డిసిల్వ(46) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ ఐదు వికెట్లు తీయగా మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీశాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధిస్తే.. ఆ ప్రభావం వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసుపై పడనుంది.

Also Read : Allu Arjun: బన్నీకి భారీ పారితోషికం.. ప్రభాస్‌కి మించి?

కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ను ఆస్ట్రేలియా ఖరారు చేసుకోగా మరో స్థానం కోసం టీమ్ ఇండియా, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించినా.. డ్రాగా ముగించినా.. శ్రీలంక గెలుపోటములతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమి పాలై.. కివీస్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తే అప్పుడు లంకేయులు డబ్య్లూటీసీ ఫైనల్ కు వెళ్తుంది. కానీ శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా ఓడినా చాలు.. వారి డబ్య్లూటీసీ కథ క్లోజ్ అవుతుంది.

Also Read : Facebook: ఉద్యోగులకు మెటా షాక్.. ఉద్యోగులపై వేటుకు ప్లాన్ !

మరో వైపు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన నాలుగు టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 167.2 ఓవర్లలో 480 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(180), కెమరూన్ గ్రీన్ ( 114)సెంచరీలు బాదేశారు. ట్రావిస్ హెడ్ (32), స్టీవ్ స్మిత్ (38), నాథన్ లైన్ (34), మర్ఫీ(41) కూడా రాణించారు. భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 400 పై చిలుకు పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు తొమ్మిది సందర్భాల్లో ఈ మేర మొదటి ఇన్నింగ్స్ లో 400 పరుగుల మార్క్ దాటింది. తాజా మ్యాచ్ మినహాయిస్తే.. ఈ మేర స్కోర్ చేసిన సందర్భాల్లో ఒకసారి ఆస్ట్రేలియా విజయం సాధించగా.. నాలుగు సార్లు ఓటమిపాలైంది. మూడుసార్లు మ్యాచ్ డ్రా చేసుకుంది.

Also Read : Kiran Kumar Reddy: కమలం గూటికి కిరణ్ కుమార్ రెడ్డి