Sri Lanka vs Ireland: శ్రీలంక అతి భారీ విజయం.. గత రికార్డ్ బద్దలు
Sri Lanka Creates History In Test Format By Winning With Huge Margin On Ireland: టెస్టుల్లో శ్రీలంక సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో.. ఒక ఇన్నింగ్స్‌తో పాటు 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టెస్టుల్లో శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. ఇంతకుముందు 2004లో జింబాబ్వేపై శ్రీలంక ఒక ఇన్నింగ్స్‌తో పాటు 254 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన రికార్డ్‌ని తానే బద్దలుకొట్టుకుంది శ్రీలంక. అయితే.. ఓవరాల్‌గా టెస్టుల్లో మాత్రం అతి భారీ విజయం రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1938లో ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లండ్ ఒక ఇన్నింగ్స్‌తో పాటు 579 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకూ ఇది చెరగని రికార్డ్‌గా మిగిలిపోయింది.
Ralph Paul Yarl Case: పొరపాటున పక్కింటి డోర్‌బెల్ మోగించాడు.. వెంటనే తుపాకీ తీసి..
Also Read
- Jitesh Sharma: "ఇంకా పిల్లాడే".. వైభవ్‌ను 'అన్‌ప్రొఫెషనల్' అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్
- Manoj Tiwary: "హార్దిక్ పాండ్యా ఒంటరి అయిపోయాడు".. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
- Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
ఇక శ్రీలంక, ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. కేవలం మూడు రోజుల్లోనే ఇది ముగిసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో శ్రీలంక అద్భుతంగా రాణించి.. పసికూనపై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 597 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), కుశాల్ మెండిస్ (140), దినేశ్ చండీమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి దిగిన ఐర్లాండ్ జట్టు.. 143 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలోఆన్ ఆడిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 168 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా.. శ్రీలంక జట్టు ఒక ఇన్నింగ్స్‌తో పాటు 280 పరుగుల భారీ తేడాతో విజయం కైవసం చేసుకుంది.
Horrible Femicide: సేద తీరడానికి బీచ్‌కి వెళ్లారు.. దారుణ హత్యకు గురయ్యారు
ఈ మ్యాచ్‌లో జయసూర్య ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన అతగాడు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఇప్పటివరకూ కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడిన జయసూర్య.. మొత్తంగా 43 వికెట్లు సాధించడంతో పాటు రెండు సార్లు 10 వికెట్లు, ఐదు సార్లు 5 వికెట్ల ఘనతను సాధించాడు. ఇదే మ్యాచ్‌లోనే రమేశ్ మెండిస్ సైతం తన పేరిట ఒక రికార్డ్ లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అతగాడు.. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్‌ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!