Horrible Femicide: సేద తీరడానికి బీచ్‌కి వెళ్లారు.. దారుణ హత్యకు గురయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three Young Women Found Dead At Equador Esmeraldas River: ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఉన్న ఎస్మరాల్డస్ బీచ్ వద్ద దారుణం చోటు చేసుకుంది. బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతుల్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆపై వారి మృతదేహాలు కనిపించకూడదని పాతిపెట్టారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఘాతుకం జరిగి ఇన్ని రోజులవుతున్నా, నిందితుల్ని పోలీసులు ఇంకా పట్టుకోలేకపోయారు. తమపై ఏదో దాడి జరగబోతోందని ముందే గ్రహించిన ఆ ముగ్గురు యువతులు.. తాము డేంజర్‌లో ఉన్నామని, ఏదో జరగబోతోందని తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు. ఆ మెసేజ్‌లు పంపిన కాసేపటికే.. దుండగులు ఆ ముగ్గురిని చిత్రహింసలకు గురి చేసి, గొంతు కోసి హతమార్చారు.
Tragic Incident: ఇంటిపై ఉన్న బండరాయిని కదిలించిన కోతులు.. మూడేళ్ల చిన్నారి మృతి
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ఆ ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). తమ భవిష్యత్ గురించి పక్కా ప్లాన్స్ వేసుకున్న ఈ ముగ్గురు స్నేహితులు.. బీచ్‌కు వెళ్లి సరదాగా సమయం గడపాలని భావించారు. అన్ని ఏర్పాట్లు చేసుకొని.. ఏప్రిల్ 4వ తేదీన ఎస్మరాల్డస్ బీచ్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే స్విమ్ సూట్లు ధరించి, బీచ్‌లో ఎంజాయ్ చేశారు. అయితే.. ఎవరో గుర్తు తెలియని దుండగులు ఈ ముగ్గురిని వెంబడిస్తూ వచ్చారు. తొలుత ఆ యువతులు వాళ్లను గ్రహించలేదు. కానీ.. అందరూ ఈ బీచ్ ప్రాంతం నుంచి వెళ్లిపోయాక, తమని ఎవరో వెంబడిస్తున్నారన్న విషయం వాళ్లకు అర్థమైంది. అప్పుడే తాము డేంజర్‌లో ఉన్నామని గ్రహించిన ఆ యువతులు.. రాత్రి 11:10 గంటల సమయంలో తమ ప్రియమైన వారికి ‘తాము ప్రాణపాయ స్థితిలో ఉన్నా’మని మెసేజ్‌లు పంపారు. నయేలి తన సోదరికి.. ‘‘ఏదో జరదకూడదని జరగబోతోందని భయంగా ఉంది, అందుకే నీకు మెసేజ్ చేశా’’ అని సందేశం పంపింది. సోదరి వెంటనే ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నయేలికి ఆల్రెడీ పెళ్లై, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది.
Extramarital Affair: అల్లుడితో లాడ్జ్‌కి వెళ్లిన అత్త.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
డెన్నిస్ కూడా హత్యకు గురికావడానికి ముందే.. తన ప్రియుడికి ‘‘ఏదో బ్యాడ్‌గా జరగోబోతోందని అనిపిస్తోంది, ఒకవేళ నాకేదైనా జరిగితే ఒక్క విషయం గుర్తుంచుకో, ఐ లవ్ యూ వెరీ మచ్’ అని మెసేజ్ చేసింది. మెసేజ్ అందుకున్న వెంటనే ప్రియుడు కాల్ చేయగా.. ఆమె ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయి ఉంది. అనంతరం కాసేపటికే ఆ దుండగులు వారిని దారుణంగా హతమార్చి, వారి మృతదేహాల్ని పూడ్చి పెట్టారు. ఏప్రిల్ 5వ తేదీన జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం గమనించారు. అక్కడికి వెళ్లి చూడగా.. వాళ్లకు శవాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ముగ్గురిలో ఒక యువతి, బీచ్‌కి వెళ్లడానికి ముందు ఒక హోటల్‌లో గడిపిన విషయం తెలిసింది. దీంతో.. క్లూస్ కోసం పోలీసులు సీసీటీవీ రికార్డులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?