IND Vs SA: భారత బౌలర్ల వైఫల్యం.. తొలి టీ20లో దక్షిణాఫ్రికా ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఖంగుతింది. భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో పరాజయం మూటగట్టుకుంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ జట్టు ఆటగాళ్లు డుస్సెన్ 75 నాటౌట్, డేవిడ్ మిల్లర్ 64 నాటౌట్ చెలరేగి ఆడారు. ఓపెనర్లు డికాక్ (22), బవుమా (10) విఫలమైనా 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసినా సఫారీ జట్టు గెలిచిందంటే కారణం ఇద్దరే ఆటగాళ్లు.
ఐపీఎల్‌లో చక్కని ఆటతీరు కనబరిచిన డేవిడ్ మిల్లర్ ఆ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్ల తేడాతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డుస్సెన్ ఐదు సిక్సర్లు, 7 ఫోర్లతో 75 పరుగులు చేసి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీళ్లిద్దరూ సిక్సర్లు, ఫోర్లతో ఇండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, భువనేశ్వర్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Also Read
- GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్‌మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!