భారత్ ఓటమి.. మ్యాచ్ పాయే.. సిరీస్ కూడా పోయే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాను వరుస పరాజయాలు వేధిస్తూనే ఉన్నాయి.. రెండో వన్డేలోనూ ఓటమి పాలు కావడంతో.. కేవలం మ్యాచ్‌నే కాదు.. సిరీస్‌ను కూడా కోల్పోయింది భారత జట్టు.. బొల్యాండ్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చెందింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే.. టీమిండియా పెట్టిన టార్గెట్‌ను ఛేధించి విక్టరీ కొట్టింది సౌతాఫ్రికా.. దీంతో… మూడు వన్డేల సిరీస్‌ను వరుస రెండు వన్డేల్లో విజయం సాధించి.. మరో వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది.. భారత ఇన్నింగ్స్‌లో 55 పరుగులతో కేఎల్ రాహుల్, 85 పరుగులతో రిషభ్ పంత్ ఆకట్టుకోగా.., 29 పరుగులతో శిఖర్ ధవన్, 22 పరుగులతో వెంకటేశ్ అయ్యర్, 40 రన్స్‌తో శార్దూల్ ఠాకూర్, 25 పరుగులతో రవిచంద్రన్ అశ్విన్ పరవాలేదనిపించారు.. కానీ, విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. ఇక, భారత్ నిర్ధేశించిన 288 పరుగుల టార్గెట్‌ను 48.1 ఓవర్లలోనే ఛేధించింది సౌతాఫ్రికా.. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.. క్వింటాన్ డి కాక్ 78, మలన్ 91, బవుమా 35, ఎయిడెన్ 37, డుస్సెన్ 37 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు.. మొత్తంగా భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా.. రెండో వన్డేతో పాటు సిరీస్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Tags
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!