Site icon NTV Telugu

Smriti Mandhana Net Worth: స్మృతి సూపర్.. ఆటలో విజయం, సంపాదనలో సూపర్ స్టార్!

Smriti Mandhana Net Worth

Smriti Mandhana Net Worth

Smriti Mandhana Net Worth 2026: భారత మహిళా క్రికెట్‌కు గ్లోబల్ ఐకాన్‌గా మారిన స్మృతి మందాన.. గత రెండు సీజన్లుగా అసాధారణ విజయాలను అందుకుంటున్నారు. ప్రపంచ స్థాయి బ్యాటింగ్ ప్రదర్శనలతో పాటు కమర్షియల్‌గా కూడా భారీ ఎదుగుదల సాధించారు. 2025లో జరిగిన మహిళల క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు చారిత్రాత్మక తొలి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి.. టోర్నమెంట్ టాప్ బ్యాటర్లలో ఒకరిగా నిలిచారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన స్మృతి మందాన.. ఫ్రాంచైజ్ క్రికెట్‌లోనూ ప్రభావం కొనసాచారు. 2026 ఫిబ్రవరిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ముందుండి నడిపిస్తూ.. రెండో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్‌ను అందించారు. ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆమెకు ‘బిగ్ మ్యాచ్ ప్లేయర్’గా మరింత గుర్తింపు తీసుకొచ్చింది.మొత్తంగా స్మృతి మహిళా క్రికెట్‌లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకరిగా మారారు. 2026 నాటికి ఆమె నెట్ వర్త్ సుమారు రూ.34 కోట్లు నుంచి రూ.40 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు, లీగ్ క్రికెట్ ఆదాయం, అలాగే హై-వాల్యూ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు స్మృతి మందాన సంపాదనకు ప్రధాన కారణాలు. బీసీసీఐ గ్రేడ్ ‘A’ సెంట్రల్ కాంట్రాక్ట్ కింద స్మృతికి ఏటా రూ.50 లక్షలు దక్కుతున్నాయి. అదనంగా మ్యాచ్ ఫీజుల రూపంలో టెస్టులకు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షలు సంపాదిస్తారు. బీసీసీఐ నుంచే స్మృతి ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా స్మృతి అత్యధిక పారితోషికం అందుకునే ఆటగాళ్లలో ఒకరు. ప్రతి సీజన్‌కు సుమారు రూ.3.4 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది.

క్రీడారంగం మాత్రమే కాదు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలోనూ స్మృతి మందాన హవా కొనసాగుతోంది. స్పోర్ట్స్‌వేర్, బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్, న్యూట్రిషన్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తున్నారు. ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. స్మృతి విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నారు. ఆమె ఇప్పుడు సౌకర్యవంతమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారు. అంతటి విజయాలు, సంపాదన ఉన్నప్పటికీ.. ఆమె తన సహజ వ్యక్తిత్వంతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు .మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ప్రేక్షకాదరణ, డబ్ల్యుపీఎల్ విస్తరణ, స్మృతి వ్యక్తిగత బ్రాండ్ విలువను పరిగణనలోకి తీసుకుంటే.. 2026 తర్వాత కూడా ఆమె నెట్ వర్త్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version