Smriti Mandhana: నేను బాగా ఆడలేదు.. ఆమె ఆటకు ఫిదా అయ్యా.. స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు!
- 47 బంతుల్లో 74 పరుగులు చేసిన స్మృతి
- టీ20 ప్రపంచకప్ 2026లో రెండో అర్ధ శతకం
- స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana Interview: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్‌పై భారత మహిళల జట్టు 95 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. బుధవారం హెడింగ్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి భారత భారీ స్కోరుకు బలమైన పునాది వేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మృతి.. లీడ్స్ మైదానం బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పింది. వరుసగా రెండో అర్ధశతకం నమోదు చేసినప్పటికీ తన ఆటపై ఇంకా పూర్తి సంతృప్తి లేదని, తాను ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన స్మృతి మంధాన మట్లాడుతూ… ‘నేను లీడ్స్ మైదానంలో గతంలో ది హండ్రెడ్ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లు ఆడాను. ఈ వికెట్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుంది. అవుట్ ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. ఈరోజు నెదర్లాండ్స్ జట్టు కూడా బాగా ఆడింది’ అని పేర్కొంది. టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఎదురైన నెదర్లాండ్స్ జట్టుపై ప్రత్యేకంగా ఎలా సిద్ధమయ్యారన్న ప్రశ్నకు స్మృతి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘నెదర్లాండ్స్ జట్టు గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే వారి బౌలింగ్ విధానం, బలాబలాలపై అనేక వీడియోలు చూశాను. కానీ మేము ఎప్పుడూ ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయం. కొత్త జట్టైనా, టాప్ జట్టైనా ఒకే విధమైన గౌరవంతో బరిలోకి దిగుతాం. నెదర్లాండ్స్ ఫీల్డింగ్ చాలా బాగుంది. వారు మాకు మంచి పోటీ ఇచ్చారు’ అని తెలిపింది.
Also Read
- MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్‌లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
- Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
- Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
- Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
తన వ్యక్తిగత ఫామ్ గురించి మాట్లాడిన స్మృతి మంధాన.. ‘నేను అనుకున్న స్థాయిలో ఆడలేదని అనిపిస్తోంది. నా ఆట ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఈరోజు షెఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె ఆటకు ఫిదా అయ్యా. మేమిద్దరం కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాం. షెఫాలీ మళ్లీ పరుగుల బాట పట్టడం జట్టుకు ఎంతో కీలకం. మెగా టోర్నీలో ఆమె ఇలానే ఆడాలని కోరుకుంటున్నా. షెఫాలీ ఆడితే జట్టుకు మంచి ఆరంభం దక్కుతుంది. అలానే నాపై కూడా ఒత్తిడి తగ్గుతుంది’ అని చెప్పింది. అదేవిధంగా భారత బౌలర్ శ్రీ చరణి ప్రదర్శనను కూడా ప్రశంసించింది. ‘శ్రీ చరణి అసాధారణంగా బౌలింగ్ చేసింది. నా దృష్టిలో ప్రతిరోజూ సరైన ప్రణాళికతో కష్టపడటం, సరైన పనులు చేయడం ముఖ్యమైన విషయం. తర్వాత మ్యాచ్‌లో ఫలితం ఎలా వస్తుందో చూద్దాం’ అని పేర్కొంది. ఇప్పుడు భారత మహిళల జట్టు జూన్ 21న మాంచెస్టర్ వేదికగా దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు సిద్ధమవుతోంది. నెదర్లాండ్స్‌పై సాధించిన ఈ భారీ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
తాజావార్తలు
-
PM Modi: కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్‌లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్‌కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!