Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం
- ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. అధ్యక్షుడి పదవీకాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే ఈ ఎన్నికలు విజయం సాధించేందుకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఆలోచిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు సీనియర్ సహాయకులతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించినట్లు ప్రకటించాలా? లేదా సైనిక చర్యలను కొనసాగించాలా? అనే అంశంపై చర్చిస్తున్నారు.
అయితే ఇరాన్‌తో యుద్ధాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించే అంశంపై ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించి ఆర్థిక ఒత్తిడిని కొనసాగించడం ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ వ్యక్తిగతంగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆర్థిక ఆంక్షలు, ఒత్తిడిని కొనసాగిస్తే టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా చేయవచ్చని.. లేదంటే చివరకు ఇరాన్ పాలక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ఆరు నెలల క్రితం అమెరికా ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించింది. తొలుత ఈ ఆపరేషన్‌ను వేగంగా, నిర్ణయాత్మకంగా ముగించే చర్యగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల మోహరింపు మరింత పెరుగుతోంది. దాదాపు 50,000 మంది అమెరికా సైనికులు, 19 యుద్ధ నౌకలు, అదనపు వైమానిక రక్షణ, యుద్ధ సామగ్రి ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇక పెద్ద ఎత్తున యుద్ధం ముదిరితే నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ట్రంప్ సీనియర్ సహాయకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. గత నెలలో ట్రంప్‌కు అదనపు సైనిక ప్రణాళికలపై వివరణ ఇచ్చారు. ఇందులో ఇరాన్‌పై మరింత తీవ్రంగా వైమానిక దాడులు నిర్వహించడం, హార్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ దీవులను స్వాధీనం చేసుకునేందుకు భూతల ఆపరేషన్ చేపట్టడం, అణు కార్యకలాపాలకు రహస్యంగా ఉపయోగిస్తున్నట్లు అమెరికా అధికారులు భావిస్తున్న బలమైన భద్రతా కేంద్రం ‘పిక్‌యాక్స్ మౌంటెన్’పై దాడి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. అలాంటి చర్యలు చేపట్టాలంటే మధ్యప్రాచ్యంలో అమెరికా భారీ స్థాయిలో సైనిక బలగాలను కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరు దేశాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధిపై అమెరికా ప్రస్తుతం “దాదాపు పూర్తి నియంత్రణ” సాధించిందని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అయితే యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా నౌకాయానంపై, ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ ప్రజలు చివరకు తిరుగుబాటు చేసి పోరాడతారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.
యుద్ధం కారణంగా అమెరికా సైన్యానికి సరఫరాలు, రవాణాకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. సాధారణ రీసప్లై మార్గాల్లో అంతరాయాలు ఏర్పడటంతో.. అమెరికా నేవీకి హిందూ మహాసముద్రంలోని దూర ప్రాంతంలో ఉన్న డీగో గార్సియా అమెరికా-బ్రిటన్ సైనిక స్థావరంపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అదే సమయంలో అమెరికా ఆర్మీకి చెందిన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్లోని కొన్ని బలగాలు 2027 వరకు మధ్యప్రాచ్యంలోనే మోహరించి ఉండే అవకాశం ఉందని సమాచారం. సైనిక అధికారులు తమ కుటుంబాలకు పంపిన లేఖను WSJ పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది.
ట్రంప్ అసలు వ్యూహం ఏంటి?
ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నప్పటికీ.. మరోవైపు పెంటగాన్ మాత్రం వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉన్న సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమవుతోంది. దీంతో ఇరాన్ విషయంలో ట్రంప్ తుది వ్యూహంపై ఇంకా స్పష్టత లేకుండా పోయింది. యుద్ధానికి ముగింపు పలికి ఆర్థిక ఒత్తిడితో ఇరాన్‌ను బలహీనపరచాలనుకుంటున్నారా? లేక అవసరమైతే మరింత పెద్ద సైనిక చర్యకు దిగుతారా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
- Tags
- Donald Trump
- Iran War
- trump
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?