Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- టీ20 క్రికెట్లోనే తొలి ప్లేయర్‌గా అరుదైన ఘనత
- పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana 600 T20I Boundaries Record: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఈ రెండు మ్యాచ్‌లలో రాణించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 600 బౌండరీలను పూర్తిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచింది. టీ20 ఫార్మాట్ చరిత్రలో పురుషులు, మహిళల్లో ఈ ఘనత ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు.
600 బౌండరీలు పూర్తి:
ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ 521 బౌండరీలతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక కెప్టెన్ చమరి అతపట్టు 493 బౌండరీలతో మూడో స్థానంలో ఉంది. ఇక పురుషుల క్రికెటర్లలో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ 477 బౌండరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్ హిట్టర్ పాల్ స్టిర్లింగ్ 401 బౌండరీలతో రెండో స్థానంలో ఉండగా.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 383 బౌండరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 361 బౌండరీలు బాదాడు. రోహిత్, క్రిస్ గేల్ లాంటి హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును స్మృతి మంధాన అందుకోవడం విశేషం.
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
స్మృతి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు:
లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో స్మృతి టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 600 బౌండరీలను పూర్తి చేసింది. ఇప్పటికే మహిళల క్రికెట్లో అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్మృతి.. ఇప్పుడు టీ20 చరిత్రలో 600 బౌండరీల మైలురాయిని చేరుకుని తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
భారత్ 95 పరుగుల తేడాతో విజయం:
భారత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. 114 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఎన్. శ్రీ చరణి 4 వికెట్లతో చెలరేగగా.. షెఫాలీ వర్మ 3 వికెట్లు తీసి ఆకట్టుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండో గెలుపును నమోదు చేసి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!