Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలపై వస్తున్న విమర్శలపై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నాఖ్వీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ ఘోర ఓటములను చవిచూడటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లండన్‌లో మీడియాతో మాట్లాడిన నాఖ్వీ, జట్టును విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఏమీ సాధించని వారే ఇప్పుడు జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో కొన్ని మ్యాచ్‌ల్లో ఓటములు సహజమని, ఇటీవల భారత్ కూడా ఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్‌లో ఓడిపోయిందని గుర్తుచేశారు. ఒకట్రెండు ఓటముల ఆధారంగా జట్టు సామర్థ్యాన్ని అంచనా వేయడం సరికాదన్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న జట్టులోని ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను తప్పించి వారి స్థానంలో యువకులకు అవకాశం ఇవ్వడంపై పీసీబీ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ 0-2తో వెనుకబడి ఉంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ అత్యంత దారుణమైన స్థితిలో ఉందనడం సరికాదని నాఖ్వీ సమర్థించుకున్నారు. గతంలో వన్డే ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న పాకిస్థాన్, ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ఆడిన చివరి ఆరు వన్డే సిరీస్‌లలో నాలుగింటిని గెలుచుకున్నామని, జట్టు విజయావకాశాల శాతం 24 నుంచి 73 శాతానికి పెరిగిందని గణాంకాలను వివరించారు.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
మాజీలపై విమర్శలు..
పాకిస్థాన్ జట్టు తీరుపై షాహిద్ అఫ్రిది, మహమ్మద్ యూసుఫ్, రషీద్ లతీఫ్ వంటి మాజీ దిగ్గజాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన నాఖ్వీ, మాజీలు ఆటగాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఆపాలని కోరారు. తమ కెరీర్లో ఏమీ సాధించని వారు కూడా ఇష్టారీతిన మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఎంపిక విషయంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయని, దానికి తనదే బాధ్యతని అంగీకరించారు. జట్టును 9వ స్థానం నుంచి 1వ స్థానానికి తీసుకెళ్లడం మూడు నుంచి ఆరు నెలల్లో సాధ్యపడదని, దానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?