ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్‌మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ShubmanGill vs Abhishek Sharma: భారత క్రికెట్లో చిన్ననాటి నుంచి కలిసి ఎదిగిన స్టార్ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ. పంజాబ్ తరఫున కలిసి ఆడిన వీరిద్దరూ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే సోమవారం జరిగిన షెర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫజిల్కా ఫాల్కన్స్‌కు గిల్ ప్రాతినిధ్యం వహించగా.. అమృత్సర్ సోర్మాస్ తరఫున అభిషేక్ బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫజిల్కా ఫాల్కన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 67 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే గిల్-అభిషేక్ శర్మ మధ్య సమరం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిషేక్ వేసిన పదో ఓవర్ తొలి బంతినే గిల్ సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతికి డీప్ మిడ్‌వికెట్ దిశగా ఫోర్ బాదాడు. ఐదో బంతికి మరో భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో గిల్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
అయితే చివరి బంతికి కథ మారిపోయింది. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన శుభ్‌మన్ గిల్.. నామన్ ధీర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ తనదైన స్టయిల్లో సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమృత్సర్ జట్టు ఛేజింగ్‌లో అభిషేక్ చెలరేగాడు. కేవలం 15 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో అమృత్సర్ సోర్మాస్కు ఛేజింగ్‌లో అదిరిపోయే ఆరంభం లభించింది. రాహుల్ కుమార్ (53), ఆకాష్ పాండే (24) రానించడంతో మరో మూడు బంతులు ఉండగానే అమృత్సర్ గెలిచింది.
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!