Shubman Gill: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప..గిల్ తెలివైన సమాధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ చరిత్రలో సచిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకే సాధ్యమైన ఆటతో 20 ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. ఎవరికి సాధ్యం కానీ రికార్డుల్ని క్రియేట్ చేశాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ.. కెరీర్ మొత్తం 100 సెంచరీలతో పాటు అత్యధిక పరుగుల ఘనతను అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్‌లానే నిలకడగా రాణిస్తూ.. ఒక్కో రికార్డును చెరిపేస్తున్నాడు. ఇటీవలే కెరీర్లో 73వ సెంచరీ చేసిన విరాట్.. సచిన్ 100 సెంచరీ రికార్డును అధిగమించే దిశగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ నడుస్తోంది. ఇదే విషయమై స్పందిస్తూ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తెలివిగా సమాధానం చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత గిల్‌ను ఈ ప్రశ్న అడగగా ఇలా స్పందించాడు.
Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ పేసర్ జోరు
Also Read
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
“నా వరకు కోహ్లీనే బెస్ట్. ఎందుకంటే నేను విరాట్ ఆటను చూస్తూ పెరిగాను. సచిన్ సార్ వల్లే నేను క్రికెట్ ఆడడం మొదలు పెట్టా. సచిన్‌కు మా నాన్న వీరాభిమాని. అందుకే నన్ను క్రికెటర్‌గా మార్చాలని ఆయన కలలు కన్నారు. ఆయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయానికి నేను ఇంకా చిన్న పిల్లాడినే. నేను క్రికెట్‌ను అర్థం చేసుకోవడం మొదలెట్టాక నాకున్న రోల్ మోడల్ విరాట్ భాయ్ మాత్రమే. విరాట్ ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ బ్యాటింగ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. అందుకే నాకు విరాట్ భాయ్ రోల్ మోడల్” అని గిల్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్(112) సెంచరీతో చెలరేగాడు. తద్వారా వన్డేల్లో 4వ సెంచరీ నమోదు చేసిన ఇతడు.. గత నాలుగు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీతో పాటు రెండు శతకాలు బాదాడు. ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ 208(149), 40 నాటౌట్(53), 112(78)లతో 360 పరుగులు చేశాడు. దాంతో ఓ వన్డే సిరీస్‌లో 300 ప్లస్ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును సమం చేశాడు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!