Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijit Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలలను ఢిల్లీ పోలీసులు ఏకంగా విమానంలోనే అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న విమానం ల్యాండ్ అవగానే, పోలీసుల బృందం నేరుగా ఫ్లైట్ లోపలికి ప్రవేశించి ఈ హైడ్రామాకు తెరతీసింది. పోలీసులు విమానం ఎక్కిన వెంటనే అభిజీత్ దిప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో ద్వారా ఈ దృశ్యాలను షేర్ చేశారు. “మేము విమానం దిగే వరకు కొంచెం కూడా ఆగలేరా? రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేమేమి భయపడటం లేదు” అంటూ ఫ్లైట్‌లోని మహిళా పోలీసులతో దీప్కే వాగ్వాదానికి దిగినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన నిరసనలో పాల్గొనేందుకే అభిజీత్ ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరారు.
ఈ ముందస్తు అరెస్టులను సీజేపీ తీవ్రంగా ఖండించింది. అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలలను విమానం దిగకముందే బలవంతంగా అదుపులోకి తీసుకోవడం అత్యంత అప్రజాస్వామికమని, శాంతియుత నిరసనలను అణచివేసే కుట్రలో భాగంగానే ఢిల్లీ పోలీసులు ఈ ప్రీ-ప్లాన్డ్ చర్యకు పాల్పడ్డారని సీజేపీ ఓ ప్రకటనలో ఆరోపించింది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛను, ప్రయాణ స్వేచ్ఛను కాలరాస్తున్నారని మండిపడుతూ, వీరందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ నిరసనలను ఎక్కడికక్కడ అణచివేయడానికి పోలీసులు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఉదయాన్నే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం వీళ్లే కాకుండా, నిన్న రాత్రి నుంచి ఢిల్లీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 400 మందికి పైగా అనుమానిత నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Astrology: నవంబర్ 21 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. కానీ..!
- World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
- World Hello Day 2026 : ఒక్క 'హలో'తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
ఈ నిరసనకు ముందస్తు అనుమతి కోరలేదనే కారణంతో శుక్రవారమే ఢిల్లీ పోలీసులు దీనిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఏదేమైనా, ఈ నిరసనను పూర్తిగా అడ్డుకోవడానికి ఢిల్లీలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఆంక్షలు విధించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 30 వేలకు పైగా పోలీసులను, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) బలగాలను రంగంలోకి దించింది. అంతేకాకుండా, నిరసనకారుల రాకపోకలను పూర్తిగా నిలిపివేసేందుకు ఏకంగా 45 మెట్రో స్టేషన్లను మూసివేయడంతో పాటు డజన్ల కొద్ది రైళ్లను రద్దు చేశారు.
తాజావార్తలు
-
Trump Praises India’s GDP Growth: భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
-
Astrology: నవంబర్ 21 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. కానీ..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!