Shubman Gill 98: నెర్వస్ నైంటీస్.. గిల్ నాలుగోసారి.. 90ల్లో ఔటైన టీమిండియా కెప్టెన్స్ లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Nervous 90s as India Captain: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 368 పరుగులను అధిగమించి.. 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే గిల్ 98 పరుగుల వద్ద ఔటవడంతో మరోసారి 90లలోనే పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
నాలుగోసారి కెప్టెన్‌గా 90ల్లో ఔటైన గిల్ :
టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. 90ల్లో వికెట్ కోల్పోవడం శుభ్‌మన్ గిల్‌కు ఇది నాలుగోసారి. గతంలో 2021లో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో 91 పరుగులు, 2024లో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో 91 పరుగులు, 2024లో న్యూజిలాండ్‌తో ముంబైలో 90 పరుగుల వద్ద ఔటయ్యాడు. తాజాగా వెల్లింగ్టన్ టెస్టులో 98 పరుగులు చేసి సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. సెంచరీ చేసేందుకు గిల్ 98 పరుగుల వద్ద చాలా బంతులే ఆడాడు. మూడో రోజు ఆట ముగిసేందుకు మరో 2 బంతులే ఉండగా.. డఫీ బౌలింగ్‌లో గిల్ బౌల్డ్ అయ్యాడు. దాంతో టెస్ట్ కెరీర్లో 12వ శతకం చేసే అవకాశం చేజారింది.
Also Read
- Sara Tendulkar Wedding: శుభ్‌మన్ గిల్ కాదు.. యువ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి?
- IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
- Hardik Pandya Trade: హార్దిక్‌ను ఎందుకు తీసుకున్నామంటే.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- SWT 2026: టైటిల్ విజేతగా కర్ణాటక.. రికార్డు సృష్టించిన శ్రేయాంక పాటిల్.!
ఎంఎస్ ధోనీ టాప్:
భారత టెస్టు కెప్టెన్లుగా ఉన్న సమయంలో 90ల్లో అత్యధికసార్లు ఔటైన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ ఏకంగా నాలుగుసార్లు 90లలో వికెట్ కోల్పోయాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రెండుసార్లు ఔటయ్యాడు. నారీ కాంట్రాక్టర్, ఎంఏకే పటౌడీ, అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఒక్కోసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. గిల్‌కు ఇది వ్యక్తిగతంగా నిరాశ కలిగించే ఇన్నింగ్స్ అయినప్పటికీ.. జట్టు మాత్రం భారీ స్కోరు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 486/4తో పటిష్ఠ స్థితిలో ఉంది.
టెస్టుల్లో 90ల్లో గిల్ అవుటైన సందర్భాలు:
91 పరుగులు – ఆస్ట్రేలియాతో, బ్రిస్బేన్, 2021
91 పరుగులు – ఇంగ్లాండ్‌తో, రాజ్‌కోట్, 2024
90 పరుగులు – న్యూజిలాండ్‌తో, ముంబై (వాంఖడే స్టేడియం), 2024
98 పరుగులు – న్యూజిలాండ్‌తో, వెల్లింగ్టన్, 2026
టెస్టుల్లో భారత కెప్టెన్‌గా 90ల్లో ఔటైన లిస్ట్:
4 – ఎంఎస్ ధోనీ
2 – సచిన్ టెండూల్కర్
1 – నారీ కాంట్రాక్టర్, ఎంకే పటౌడీ, అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్
తాజావార్తలు
-
Shubman Gill 98: నెర్వస్ నైంటీస్.. గిల్ నాలుగోసారి.. 90ల్లో ఔటైన టీమిండియా కెప్టెన్స్ లిస్ట్ ఇదే!
-
IIT Kharagpur Turns 75: దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర.. 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ ప్రశంసలు!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
-
MP Nishikant Dubey: ఏంటి!! మారుతి అసలు యజమాని సోనియా గాంధీ హా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..