NTV Telugu Site icon

Shubman Gill Fined: శుభ‌మ‌న్ గిల్‌కు భారీ షాక్.. ఏకంగా 115 శాతం ఫైన్!

Gill

Gill

Shubman Gill Fined 115 percent match fee in WTC Final 2023: టీమిండియా యువ ఓపెనర్ శుభ‌మ‌న్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023లో థర్డ్ అంపైర్ నిర్ణ‌యంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన గిల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. స్లో ఓవ‌ర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జ‌రిమానా విధించింది. దాంతో మొత్తంగా గిల్‌పై 115 శాతం ఫైన్ పడింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రెండో ఇన్నింగ్స్‌లో వివాదాస్ప‌ద రీతిలో శుభ‌మ‌న్ గిల్ ఔట్ అయ్యాడు. గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కామెరూన్ గ్రీన్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ సరైనదేనని టీవీ అంపైర్ రిచ‌ర్డ్ కెటిల్‌బ‌రో త‌న నిర్ణ‌యాన్ని తెలిపారు. అంపైర్ నిర్ణ‌యంపై గిల్ అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు తన సోష‌ల్ మీడియా ఖాతాలో కామెంట్ కూడా చేశాడు. గిల్ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా అత‌నికి 15 శాతం ఫైన్ వేస్తున్నట్టు ఐసీసీ పేర్కొంది. ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి 2.7 రూల్‌ను గిల్ అతిక్ర‌మించిన‌ట్లు ఐసీసీ తెలిపింది. గిల్‌పై మొత్తం 115 శాతం జ‌రిమానా పడింది.

Also Read: World Cup 2023: ఉప్పల్ లో టీమిండియా మ్యాచ్ లు లేనట్లే..?

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో స్లో ఓవ‌ర్ రేట్ మెయింటేన్ చేసిన భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల‌కు ఐసీసీ జ‌రిమానా విధించింది. ఫైన‌ల్లో నెమ్మ‌దిగా బౌలింగ్ చేసిన భారత జ‌ట్టుకు మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ వేయగా.. ఆస్ట్రేలియాకు మ్యాచ్ ఫీజులో 80 శాతం ఫైన్ వేసింది. నిర్దేశిత స‌మ‌యంలో భారత్ 5 ఓవ‌ర్లు.. ఆస్ట్రేలియా 4 ఓవ‌ర్లు త‌క్కువ‌గా వేసిన‌ట్లు ఐసీసీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఆర్టిక‌ల 2.22 ప్ర‌కారం ఒక ఓవ‌ర్ ఆల‌స్య‌మైతే.. మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వేస్తారు.

Also Read: Asia Cup 2023: పంతం నెగ్గిన పాకిస్తాన్.. అందుకు ఏసీసీ పచ్చజెండా?

ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. విరాట్ కోహ్లి, అజింక్య రహనే టాప్ స్కోరర్లు. భారత్ వరుసగా రెండో ఫైనల్ ఓడిపోయింది.