Shreyas Iyer Record: ‘కింగ్ ఎక్కడన్నా కింగే’ రా.. పీబీకేఎస్, కేకేఆర్ చరిత్రలోనే శ్రేయస్ అయ్యర్ టాప్!
- ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్సీ అనేది ప్రత్యేకం
- కెప్టెన్సీ అంటే కేవలం జట్టును నడిపించడం మాత్రమే కాదు
- తనదైన ముద్ర వేస్తున్న శ్రేయస్ అయ్యర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Tops PBKS and KKR Captaincy Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో కెప్టెన్సీ అనేది ప్రత్యేకం. ఇక్కడ నిరూపించుకుంటే.. భారత జట్టును సారథ్యం వహించే అవకాశాలు మెరుగవుతాయి. కెప్టెన్సీ అంటే కేవలం జట్టును నడిపించడం మాత్రమే కాదు.. ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకుని టీంను విజయపథంలో నడిపించడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తనదైన ముద్ర వేస్తున్నాడు. శ్రేయస్ నాయకత్వం వహించిన జట్లలో విజయం శాతం చూస్తే.. అతడు ఎంత సమర్థవంతమైన కెప్టెన్ అన్నది స్పష్టంగా తెలుస్తోంది.
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అద్భుత రికార్డు నమోదు చేశాడు. అతడి నాయకత్వంలో జట్టు 61.11 శాతం విజయాలు సాధించడం విశేషం. ఇది పంజాబ్ కింగ్స్ చరిత్రలోనే అత్యధికం. ఈ జాబితాలో శ్రేయాస్ తర్వాతి స్థానాల్లో యువరాజ్ సింగ్ (58.6), జార్జ్ బేలీ (51.4), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (50.0), మయాంక్ అగర్వాల్ (50.0) ఉన్నారు. ఈ గణాంకాలు చూస్తే పంజాబ్ జట్టును అయ్యర్ ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడో అర్థమవుతుంది. కొన్నేళ్ల పాటు సెమీస్ దాటని పంజాబ్ టీంను శ్రేయస్ ఐపీఎల్ 2025లో ఫైనల్ వరకు చేర్చాడు.
Also Read
- Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women's Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా కూడా శ్రేయస్ అయ్యర్ తన ప్రతిభను నిరూపించాడు. కేకేఆర్ తరఫున అతడి విజయం శాతం 58.6గా ఉంది. ఇది కూడా కేకేఆర్ చరిత్రలో టాప్‌లోనే ఉంది. గౌతమ్ గంభీర్ (56.5), దినేష్ కార్తిక్ (51.3), సౌరవ్ గంగూలీ (48.1), ఇయాన్ మోర్గాన్ (45.8) వంటి దిగ్గజ కెప్టెన్లను కూడా అయ్యర్ వెనక్కి నెట్టడం విశేషం. శ్రేయస్ సారథ్యంలో కేకేఆర్ టైటిల్స్ కూడా గెలుచుకుంది.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ముఖ్యంగా కనిపించేది అతడి ప్రశాంత స్వభావం. ఆటపై స్పష్టమైన అవగాహన, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలర్లను ఉపయోగించడం, ఫీల్డింగ్ సెట్టింగ్స్ మార్చడం వంటి అంశాల్లో కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తాడు. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారికి అవకాశాలు ఇవ్వడం కూడా శ్రేయస్ నాయకత్వంలో మరో ప్రత్యేకత అనే చెప్పాలి. ఇప్పటికే రెండు జట్లకు కెప్టెన్‌గా నిలిచి టాప్ విజయం శాతంతో చరిత్ర సృష్టించిన శ్రేయస్.. భవిష్యత్తులో ఐపీఎల్‌లో మరిన్ని విజయాలు సాధించడం ఖాయం. అతడి నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో టైటిల్ గెలుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!