India vs Pakistan Match: టీమిండియా ఓటమికి ‘‘ప్లాన్’’ చేసిన షాహిద్ అఫ్రిది..

  • భారత ఓటమికి ప్లాన్ చేస్తున్న షాహిద్ అఫ్రిది..
  • తక్కువ తప్పులు చేసిన వారే గెలుస్తారని సలహా..
  • గతంలో పోలిస్తే పాక్ బలంగా ఉందని కామెంట్స్..
Shahid Afridi

Shahid Afridi

India vs Pakistan Match: T20 వరల్డ్ కప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా క్రికెట్ సమరం జరగబోతోంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, రెండు టీములు కూడా గెలుపు స్ట్రాటజీలు రచిస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎప్పటికప్పుడు పాక్ టీంకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్ చేతిలో వరస ఓటములు రికార్డ్ పాక్ పేరిట ఉంది. ఈ సారి ఆ రికార్డును చెరిపేయాలని పాక్ భావిస్తోంది.

Read Also: Bangladeh Elections: ముగ్గురు భారత వ్యతిరేక ఉగ్రవాదులు.. బంగ్లా ఎన్నికల్లో ఘన విజయం..

ఇదిలా ఉంటే, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్ట్రాటజిస్ట్ అవతారమెత్తాడు. భారత్‌ను ఎలా ఎదుర్కోవానే అంశాలను వివరించాడు. పాకిస్తాన్ తెలివిగా, కుదురుగా ఉండే ఆటతీరును ప్రదర్శించాలని సలహా ఇచ్చాడు. హై ప్రెజర్ మ్యాచ్‌లో ప్రతిభ కన్నా తరుచుగా ప్రాథమిక విషయాలే ఫలితాలను నిర్ణయిస్తాయని అఫ్రిది చెప్పారు. ‘‘తప్పులు అందరి వద్ద ఉంటాయి. కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌, ఈ మూడు విభాగాల్లో తక్కువ తప్పులు చేసిన వారే గెలుస్తారు’’ అని అన్నారు.

గతంలో పోలిస్తే పాక్ జట్టు మరింత డెప్త్‌గా ఉంది. 8వ నెంబర్ వరకు పాక్‌లో హిట్టర్లు ఉన్నారు. టాప్-6 బ్యాటర్లు 15-16 ఓవర్లు ఆడితే, చివరి ఓవర్లలో పవర్ హిట్లర్లు స్వేచ్ఛగా ఆడి స్కోర్ పెంచొచ్చని చెప్పారు. స్కోర్ బోర్డు ముందు కదలాలి, అయితే అవసరం లేని రిస్క్ తీసుకని వికెట్లు ఇవ్వకూడదని చె ప్పారు. రన్‌రేట్, రిస్క్ మేనేజ్మెంట్ రెంటింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలని అన్నారు.