Site icon NTV Telugu

కోవిడ్‌ బారిన ఏడుగురు భారత ఆటగాళ్లు..

కరోనా థర్డ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది.. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతూ పోతున్నాయి కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. భారత్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది.. అయితే, తాజాగా, ఏడుగురు భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కోవిడ్‌ బారినపడడం కలకలం సృష్టిస్తోంది.. దీంతో.. ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​టోర్నీ- 2022కు కోవిడ్‌ సెగ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు ఏడుగురు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని.. వారంతా టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది.. ఇప్పటి వరకు కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్, ఖుషీ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. ఆ ఏడుగురితో సన్నిహితంగా ఉన్న ఇతర ఆటగాళ్లకు, సిబ్బందికి కూడా టెస్ట్‌లు నిర్వహించే పనిలో పడిపోయారు..

Read Also: ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం

Exit mobile version