ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది… రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ వాతావరణం నెలకొంది.. చలి కూడా తీవ్రంగానే ఉంది.. అయితే, ఉదయం వాతావరణ మారిపోయింది.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇవాళ ఉదయం నుంచి ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్య పురి, కొత్తపేట్‌, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇక, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి.. ఇక, హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది.

Related Articles

Latest Articles