Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saransh Jain India Debut: శ్రీలంకతో కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 33 ఏళ్ల సారంశ్ జైన్ టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో.. అతడి స్థానంలో సారంశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. జాతీయ జట్టులోకి ఎంపిక కావడంతోనే సారంశ్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
21వ శతాబ్దంలో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అత్యధిక వయస్కుడిగా సారంశ్ జైన్ నిలిచాడు. సారంశ్ ప్రస్తుత వయసు 33 ఏళ్ల 145 రోజులు. ఇంతకుముందు ఈ రికార్డు సబా కరీం పేరిట ఉంది. 2000లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో సబా కరీం 32 ఏళ్ల 362 రోజుల వయసులో భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పుడు సారంశ్ జైన్ 33 ఏళ్ల 145 రోజుల వయసులో అరంగేట్రం చేయడంతో ఆ రికార్డును అధిగమించాడు.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
సారంశ్ జైన్ అరంగేట్రంతో మరో ప్రత్యేక ఘనతను కూడా అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే భారత జాతీయ జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు మురళీ విజయ్, మహ్మద్ షమీ ఈ అరుదైన ఫీట్‌ను సాధించారు. విజయ్ 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై టెస్టులో అరంగేట్రం చేయగా.. షమీ 2013లో ఢిల్లీలో పాకిస్థాన్‌పై వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
సారంశ్ జైన్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేసిన అతడు.. ఎన్నో ఏళ్ల పాటు జాతీయ జట్టు పిలుపు కోసం ఎదురుచూశాడు. ఇప్పుడు 33 ఏళ్ల వయసులో ఆ కల నెరవేరింది. టెస్ట్ సిరీస్ ముందు లంక-ఏ జట్టుపై సారాంశ్ ఆకట్టుకున్నాడు. రెండో టెస్టులో 6 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 70 పరుగులు చేసి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామ సమయానికి 25 ఓవర్లలో 88/2 స్కోరుతో ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!