సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 10, 6, 0, 24 పరుగులతో నిరాశ పరిచాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ.. సంజు చెత్త ప్రదర్శనపై అటు మాజీలు, ఇటు ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ‘వరల్డ్‌కప్‌కు సంజు వద్దు’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో చెత్త ప్రదర్శనపై సంజు స్పందించాడు. ప్రస్తుత టీ20 సిరీస్‌లో వ్యక్తిగతంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ.. జట్టు ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు.
Also Read: Gold Rate Today: బంగారంపై 12 వేలు, వెండిపై 30 వేలు.. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరిన ధరలు!
విశాఖలో నాలుగో టీ20 మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సంజు శాంసన్ స్పందించాడు. ‘ఈ సిరీస్‌లో నేను ఆశించిన రీతిలో రాణించలేకపోయాను. కానీ జట్టుగా మేము బాగా ఆడుతున్నాం. అదే నాకు పెద్ద పాజిటివ్. జట్టు ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తానని నమ్మకంగా ఉన్నా. సిరీస్‌ను గెలుపుతో ముగించాలని చూస్తున్నాను’ అని సంజు చెప్పాడు.
వ్యక్తిగత ఫామ్ కంటే జట్టు విజయం తనకు ముఖ్యమని సంజు శాంసన్ స్పష్టం చేశాడు. మరి చివరి టీ20 మ్యాచ్‌లో అతడు ఎలా ఆడుతాడో చూడాలి. టీ20 సిరీస్‌లో విఫలమైన సంజు టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆడుతాడో లేదో చూడాలి. జట్టులో మార్పులు చేసుకోవడానికే ఈ నెల 31 చివరి తేదీ. మరి సంజు విషయంలో బీసీసీఐ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది.