సిరాజ్ గురించి అసలు ప్రస్తావనే లేదు: మంజ్రేకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో వన్డే సిరీస్‌తో పాటు తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌నూ టీమిండియా కైవసం చేసుకుంది. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రాణించాడు. అలాగే సిరాజ్ కూడా రెండు మ్యాచుల్లో కీలకమైన వికెట్లు తీశాడు. అయితే మూడో వన్డే తర్వాత సిరాజ్ గురించి పెద్దగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. నిలకడగా ఆడుతూ అద్భుతమైన పెర్ఫామెన్స్ చేస్తున్న సిరాజ్‌పై మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
R Sridhar : అశ్విన్ అలా అనేసరికి షాకయ్యా: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
Also Read
- Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
- Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
“న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం సిరాజ్ గురించి ప్రస్తావన చాలా తక్కువగా ఉంది. ఎవరూ కూడా పెద్దగా మాట్లాడలేదు. అయితే నేను చూసిన నంబర్‌వన్ ఆటగాడు సిరాజ్ మాత్రమే. అతడి ఎదుగుదల కూడా అద్భుతంగా ఉంది. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. మంచి లయతో బంతులను విసురుతున్నాడు. వన్డేల్లోనే కాకుండా.. టీ20లు, టెస్టుల్లోనూ రాణిస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ ద్విశతకం, శతకం సాధించాడు. కానీ, కఠినమైన ప్రత్యర్థితో ఆడేటప్పుడు.. భారీగా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో బౌలింగ్ చేయడం కూడా కష్టమే. అయితే, భారత్‌కు సిరాజ్ దొరికాడు. టీమిండియాకు అవసరమైనప్పుడు సిరాజ్ వికెట్లను తీసి రాణించాడు” అని మంజ్రేకర్ తెలిపాడు.
MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదే లే
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో దుమ్ములేపింది టీమిండియా. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, గిల్ అదిరిపోయే శుభారంభం అందించారు. రోహిత్ 85 బంతుల్లో 101 రన్స్ చేసి వన్డేల్లో 30వ సెంచరీ ఖాతాలో వేసుకోగా.. గిల్ 78 బంతుల్లో 112 రన్స్‌తో శతకం బాదాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 385/9 భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలింగ్‌లోనూ భారత బౌలర్లు రాణించడంతో కివీస్ 41.2 ఓవర్లలో 295 రన్స్‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ కాన్వే (138) తప్ప మరెవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో శార్దూల్, కుల్దీప్ చెరో 3 వికెట్లతో సత్తాచాటగా.. చాహల్ 2, ఉమ్రాన్ 1, హార్దిక్ 1 వికెట్లు దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!