Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonal Dinusha on 3 Centuries vs India: శ్రీలంక, భారత్ మధ్య కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఓ దశలో లంక ఓటమి ఖాయం అనుకున్నా.. యువ బ్యాటర్ సోనాల్ దినుష పోరాటంతో డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన దినుష.. రెండో ఇన్నింగ్స్‌లో మరో సెంచరీతో మ్యాచ్‌ను డ్రా వైపు మళ్లించి లంకను గట్టెక్కించాడు. రెండు టెస్టుల సిరీస్‌లో మూడు సెంచరీలు బాదాడు. టీమిండియాపై వరుసగా సెంచరీలు చేసిన దినూష తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పటిష్ట టీమిండియాపై సెంచరీలు చాలా సంతోషంగా ఉందని, గాల్లో తేలిపోతున్నట్లు ఉందని చెప్పాడు.
సోనాల్ దినూషకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన విజయానికి కోచింగ్ స్టాఫ్, చిన్ననాటి స్కూల్ కోచ్, ప్రావిన్స్ కోచ్, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని చెప్పాడు. ‘ముందుగా ఇక్కడ పరుగులు సాధించేందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. ముఖ్యంగా మా కోచింగ్ సిబ్బందికి ధన్యవాదాలు. వాళ్లు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే నా స్కూల్ కోచ్‌లు, ప్రావిన్షియల్ కోచ్‌లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. ఇక్కడి పిచ్ టర్న్ అవుతుందని ముందుగానే అర్థం చేసుకున్నాను. అందుకు అనుగుణంగా కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించాను. అదే నాకు పరుగులు సాధించేందుకు ఉపయోగపడింది’ అని చెప్పాడు.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
‘ఐదో రోజు టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం బాగా అనిపించింది. మా టెయిలెండర్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. నేను మరిన్ని పరుగులు చేయడానికి వారు సాయపడ్డారు. పరిస్థితిని అర్థం చేసుకుని నా వంతుగా అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నించాను. పరుగులు అవే వచ్చాయి. జట్టుకు నా వంతు సాయం చేసినందుకు సంతోషంగా ఉంది. రెండు టెస్టుల సిరీస్‌లో మూడు సెంచరీలు చేశా. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరుగులు సాధించాలనే ఉద్దేశంతోనే నేను బ్యాటింగ్ చేశాను. అదే నా ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే శతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. భారత్‌పై సుమారు 420 పరుగులుచేశాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. భారత్‌పై పరుగులు సాధించడం ఒక ఆటగాడిగా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది అద్భుతమైన అనుభూతి’ అని సోనాల్ దినూష చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!