క్రికెట్ చరిత్రలోనే సచిన్ టెండూల్కర్ నెలకొల్పినని రికార్డులు మరెవరు చేసుండరు. అయితే అందులో కొన్ని రికార్డులను ప్రస్తుత ఆటగాళ్లు బ్రేక్ చేసిన కొన్ని రికార్డుల ధరి దాపులోకి కూడా ఎవరు రాలేకపోతున్నారు. అయితే సరిగ్గా 12 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్ లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇదే రోజున సచిన్ 30,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇదే మ్యాచ్ లో సచిన్ తన 43వ టెస్ట్ సెంచరీ కూడా సాధించాడు. టెండూల్కర్ మొత్తం 664 మ్యాచ్‌లలో 48.52 సగటుతో మొత్తం 34,357 పరుగులు చేసాడు. అయిన ఇప్పటికి కూడా ఈ రికార్డ్ ఇలాగె ఉంది. ఇక ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం 445 మ్యాచ్‌లలో 23,161 పరుగులతో కొనసాగుతున్నాడు. కానీ ఇంకా సచిన్ కంటే 11 వేలకు పై పరుగుల వెనుకబడి ఉన్నాడు.