NTV Telugu Site icon

Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్

Rohit Sharma Kohli Form

Rohit Sharma Kohli Form

Saba Karim Sensational Tweet On Virat Kohli Rohit Sharma: ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్క అర్థశతకం మినహాయిస్తే.. తన మార్క్ ఇన్నింగ్స్ అతడు ఆడలేదు. గత ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమై.. తన పేరిట చెత్త రికార్డ్ కూడా లిఖించుకున్నాడు. మరోవైపు.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్ ప్రారంభంలో బాగానే రాణించినా, ఆ తర్వాతి నుంచి తడబడుతున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔట్ అవ్వగా, అంతకుముందు డీసీతో జరిగిన మ్యాచ్‌లో నిదానంగా ఆడాడు. 46 బంతులు ఆడి 55 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే.. రోహిత్, కోహ్లీల ఫామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లు అయ్యుండి.. ఇలా ఆడుతున్నారేంటని ఏకిపారేస్తున్నారు.

Priyanka Chopra: నా 17 ఏళ్ళ వయస్సులో నా భర్త.. నన్ను చూస్తూ ఆ పని చేశాడట

ఇప్పుడు తాజాగా టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, మాజీ సెలక్టర్‌ సబా కరీం విరాట్, రోహిత్‌లపై సంచలన ట్వీట్ చేశాడు. ఆ ఇద్దరి పని అయిపోయిందన్నట్టుగా ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘‘యశస్వీ జైశ్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి నుంచి టీ20 క్రికెట్‌ మూవ్‌ ఆన్‌ అయినట్లు కనిపిస్తోంది’’ అంటూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్‌కి అనిల్‌ కుంబ్లే, హర్షా కుంబ్లేలను ట్యాగ్‌ చేశాడు. కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. లీగ్ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు తేడా ఉందని.. టీమిండియాను ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించిన ఘనత రోహిత్‌, కోహ్లీలదని పేర్కొన్నారు. యశస్వి, సూర్యను ప్రశంసించడంలో తప్పులేదు కానీ.. ఆ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు. రోహిత్‌ పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడన్న మాట వాస్తవమే కానీ.. ఆసియా టీ20 కప్‌-2022, టీ20 ప్రపంచకప్‌-2022లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ ఎలా మర్చిపోతారంటూ ప్రశ్నిస్తున్నారు.

Yashasvi Jaiswal: నా ఎదుగుదలకు వారే కారణం.. సీక్రెట్ చెప్పేసిన జైస్వాల్

ఇదిలావుండగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో జైస్వాల్, సూర్య దుమ్ముదులిపేస్తున్నారు. సీజన్ మొదటి నుంచి జైస్వాల్ రప్ఫాడిస్తుండగా.. సూర్య ఈమధ్యే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్‌-2023లో యశస్వి జైశ్వాల్‌ ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లో 167.15 స్ట్రైక్‌రేటుతో 575 పరుగులు సాధించాడు. ఇక సూర్య 186.13 స్ట్రైక్‌రేటుతో 376 పరుగులు చేశాడు. ఆర్సీబీ బ్యాటర్‌ కోహ్లి 11 ఇన్నింగ్స్‌లో 133.75 స్ట్రైక్‌రేటుతో 420 పరుగులు సాధించగా.. ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ 11 ఇన్నింగ్స్‌లో 191 పరుగులు సాధించాడు.