Royal Challengers Bangalore Creates Another Worst Record In IPL: ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఇప్పటికే ఒక చెరగని చెత్త రికార్డ్ ఉంది. కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయ్యి.. అత్యల్ప స్కోరుకి చాపచుట్టేసిన జట్టుగా నిలిచింది. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఆర్సీబీ ఈ ‘చెత్త’ రికార్డ్‌ని తన పేరిట లిఖించుకుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోరును నమోదు చేయలేదంటే.. ఎంత చిత్తుచిత్తుగా ఓడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆర్సీబీ జట్టు ఇదే ఐపీఎల్‌లో మరో చెత్త రికార్డ్‌ని నమోదు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో 125 పరుగులలోపు అత్యధిక సార్లు (15 సార్లు) ఆలౌటైన జట్టుగా అవతరించింది. ఏప్రిల్ 7వ తేదీన కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ అవ్వడంతో, ఈ చెత్త రికార్డ్ ఆ జట్టు సొంతం అయ్యింది. ఆర్సీబీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 15 సార్లు 125 స్కోరులోపే ఆలౌటైంది. ఈ రెండు జట్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ 11 సార్లు, కేకేఆర్, ముంబై ఇండియన్స్ 9 సార్లు, పంజాబ్ 8 సార్లు 125 పరుగుల లోపు ఆలౌటయ్యాయి.
Royal Challengers Bangalore: ఆర్సీబీకి పెద్ద షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఔట్!

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై కేకేఆర్ జూలు విదిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ 68 పరుగులతో శివాలెత్తతగా.. గుర్బాజ్ (57), రింకూ సింగ్ (46) కూడా అదరగొట్టారు. ఇక 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మొదట్లో శుభారంభం చేసినా, ఆ తర్వాత స్పిన్నర్ల దెబ్బకు పతనమైంది. విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్ ఔటవ్వగా.. మిగతా బ్యాటర్లు కూడా పెవిలియన్ బాట పట్టారు. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టడంతో.. ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి దెబ్బకు.. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానం నుంచి ఏకంగా ఏడో స్థానానికి పడిపోయింది.
Mumbai: ముంబైలో అక్రమ ఫిల్మ్ స్టూడియోలు కూల్చివేత.. బీజేపీ సంబరాలు