Rohit Sharma: ఇంగ్లండ్‌తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్‌కు ప్రధాన సమస్య!
- మూడో వన్డే మ్యాచ్‌కు ఆసన్నమైన సమయం
- మరోసారి చర్చనీయాంశంగా రోహిత్ శర్మ ఫామ్
- అదే రోహిత్‌కు ప్రధాన సమస్య అంటున్న అభిషేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Nayar on Rohit Sharma Form: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం తేలిపోతున్నాడు. తొలి రెండు వన్డేల్లో వరుసగా 11, 26 పరుగులే చేయడంతో.. అతడి బ్యాటింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ ఫామ్‌పై మాజీ భారత బ్యాటర్, మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. స్వింగ్, సీమ్‌కు గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ఫార్మాట్లు ఆడని రోహిత్ శర్మ అలాంటి పరిస్థితుల్లో కాస్త సమయం తీసుకుని బ్యాటింగ్ చేయడం సహజమే. రెండో వన్డేలో హిట్‌మ్యాన్ బ్యాటింగ్ టెంపో బాగానే కనిపించింది. స్ట్రైక్‌రేట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. కానీ సాధారణంగా రోహిత్ 25-30 పరుగుల వరకు వచ్చాడంటే దాన్ని అర్ధశతకంగా, భారీ స్కోర్‌గా మార్చేస్తాడు. ఈసారి 26 పరుగుల వద్దే ఔటవ్వడం మాత్రం అతడిని కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. అదే రోహిత్‌కు ప్రధాన ఆందోళ’ అని చెప్పాడు.
Also Read
- BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
- Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
- Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
- Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
రెండో వన్డేలో ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔటైన తీరు పైనా నాయర్ స్పందించాడు. ‘సాధారణంగా రోహిత్ ఆఫ్ స్పిన్నర్లకు ఎక్కువగా వికెట్ ఇవ్వడు. కానీ ఈసారి పరుగుల కోసం ఒత్తిడిలో ఉండటం వల్లే ఆ షాట్ ఆడాడు. ఇది టెక్నిక్ సమస్య కంటే మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయం. అయినప్పటికీ హిట్‌మ్యాన్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడనే నమ్మకం నాకు ఉంది. అతడి ఫామ్ గురించి నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు’ అని తెలిపాడు. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడి విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడంతో పాటు భారత్‌కు సిరీస్ విజయాన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!