NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ టెస్టు తర్వాతే రిటైర్మెంట్!

Rohit

Rohit

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిన రోహిత్.. ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ టోర్నీలోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్నారు. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని టీమిండియా సారథి రోహిత్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది..

Read Also: Flight Accident: రన్‌వేపై ఓ విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. తృటిలో తప్పిన ప్రమాదం..

అయితే, ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు రోహిత్‌ శర్మతో మాట్లాడినట్లు తెలుస్తుంది. కానీ, రోహిత్ తన మనసు మార్చుకునే ఛాన్స్ లేదని సమాచారం. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్‌ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలక్టర్లు రోహిత్‌ను ఒప్పించే అవకాశం ఉంది. దీన్ని బట్టి టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. సిడ్నీలో కంగారులతో జరిగే ఐదో టెస్టు రోహిత్‌ శర్మకు కెరీర్‌లో చివరి టెస్టు కానుంది.

Read Also: Gold Rate Today: న్యూ ఇయర్ ధమాకా.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ చేరాలంటే అదృష్టం కలిసి రావాలి. టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ఉండాలంటే ఆసీస్‌ను సిడ్నీలో జరిగే చివరి టెస్టులో ఓడించాలి. ఈ మ్యాచ్ లో ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్‌ డబ్ల్యూటీసీ రేసు నుంచి వైదులుగుతుంది. అలాగే, సిడ్నీ టెస్టులో ఇండియా గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై పూర్తిగా ఆధారపడి ఉంది.