Site icon NTV Telugu

Rohit Sharma: కపిల్ దేవ్‌కు కౌంటర్.. కోహ్లీ గురించి మీకేం తెలుసు?

Rohit Sharma

Rohit Sharma

ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా కపిల్ దేవ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో కపిల్ దేవ్‌కు తెలియదన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా డ్రెస్సింగ్ రూంలో ఒకరికి ఒకరం మద్దతు ఇచ్చుకుంటామని.. ఒక ఆటగాడి సామర్థ్యం తెలుసుకుని అతడికి అండగా నిలుస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. ఫామ్ అనేది వస్తుంది.. పోతుందని.. కానీ ఆటగాడి విలువ ఎప్పటికీ మారదన్నాడు. ఒక ఆటగాడిపై కామెంట్లు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని రోహిత్ విజ్ఞప్తి చేశాడు. అయితే తన వ్యాఖ్యల్లో కోహ్లీ గురించి ఎక్కడా రోహిత్ ప్రస్తావించకపోయినా అతడికి అండగా నిలుస్తున్నామని అతడి మాటల ద్వారా అర్ధం తెలుసుకోవచ్చు.

Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రకటనలను నిలిపివేసిన వివో.. కారణం ఏంటంటే..?

కాగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మునుపటి స్థాయిలో లేదని.. అశ్విన్ వంటి మేటి బౌలర్‌నే జట్టు నుంచి తప్పించినప్పుడు కోహ్లీని ఎందుకు పక్కనబెట్టరని సెలక్టర్లను ఇటీవల కపిల్ దేవ్ ప్రశ్నించాడు. గతంలోని ప్రదర్శనల ఆధారంగా జట్టులో కొనసాగడం మంచిది కాదన్నాడు. జట్టులో స్థానం కోసం విరాట్ కూడా పోటీ పడాలని. అతడిని అధిగమించేందుకు యువకులు ప్రయత్నించాలని కపిల్ దేవ్ సూచించాడు.

Exit mobile version