Rohit Sharma: రోహిత్ సంచలనం.. కోహ్లీ రికార్డ్ బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Breaks Virat Kohli Record: భారత క్రికెట్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మ తన ఖాతాలో వరుసగా రికార్డుల మీద రికార్డులు వేసుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా మరో రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో.. రోహిత్ ఆ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది 33వ విజయంస. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అతని సారథ్యంలో భారత్ 32 టీ20 మ్యాచెస్‌లో విజయాలు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ని రోహిత్ బద్దలు కొట్టాడు. అగ్రస్థానంలో మాత్రం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 42 విజయాలతో ఉన్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ తన విజయాల పరంపరని ఇలాగే కొనసాగిస్తే.. ధోనీ రికార్డ్‌ని సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.
ఇదే సమయంలో రోహిత్ మరో రికార్డ్ కూడా సాధించాడు. ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 మ్యాచుల్లో విజయాలను 2016లో ధోనీ (15) అందించగా.. రోహిత్ శర్మ దాన్ని సమం చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కామెరూన్ గ్రీన్ (52), ఆ తర్వాత టిమ్ డేవిడ్ (54) అర్థశతకాలతో విజృంభించడం వల్లే.. ఆస్ట్రేలియా అంత స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసి, మరోసారి మెరిశాడు. ఇక 187 లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్.. మొదట్లో కాస్త తడబడింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వెనువెంటనే వెనుదిరిగారు. అయితే.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్(69)ల విధ్వంసకర ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత జట్టు గెలుపు దిశగా సాగింది. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా (25) విన్నింగ్ షాట్ కొట్టి.. భారత్‌ను గెలిపించాడు. దీంతో.. భారత్ 2-1 తేడాతో ఈ సిరీస్ నెగ్గింది.
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!