టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మేట్ నుంచి తప్పుకున్న రోహిత్, తాజాగా టెస్టులకు వీడ్కోలు పలికాడు.సుదీర్ఘ ఫార్మెట్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నాని, నన్ను సపోర్ట్ చేస్తూ మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అంటూ రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో రోహిత్ ఇకపై రెడ్ బాల్ క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు.రోహిత్ రిటైర్మెంట్ పై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ దిగ్బ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఇండియన్ క్రికెట్ కి నువ్వు చాలా చేశావని, నువ్వు లేని టెస్ట్ క్రికెట్ ని జీర్ణించుకోలేకపోతున్నామని భావోద్వేగానికి గురవుతున్నారు. ఫ్యాన్స్ తో పాటు సహచర ఆటగాళ్లు రోహిత్ రిటైర్మెంట్ పై స్పందిస్తున్నారు.
Also Read : Rohit Sharma : రోహిత్ రిటైర్మెంట్ తో గుక్క పెట్టి ఏడ్చిన అమ్మాయి..!
రిషబ్ పంత్ ఒక ప్రకటనలో…రోహిత్ భాయ్.. నువ్వు లేని డ్రెస్సింగ్ రూమ్ ని ఉహించుకోలేకపోతున్నాను. డ్రెస్సింగ్ రూమ్ లో మీ ఉనికి ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. లవ్ యూ భాయ్ అంటూ రిషబ్ అన్నాడు. నిజానికి రోహిత్ పంత్ మధ్య సన్నిహితం సంబంధం ఉంది. పంత్ ని రోహిత్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుండేవాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరమైనప్పుడు పంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. రోహిత్ ని మేము ఎప్పుడూ సారథిగానే చూస్తామని, అతనో గొప్ప నాయకుడంటూ ఎమోషనలయ్యాడు.ఇకపోతే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టూర్ కు రోహిత్ ని ఒక ఆటగాడిగానే సెలెక్ట్ చేయబోతున్నట్లు తెలియడంతో రోహిత్ గౌరవంగా టెస్టుకు రిటైర్మెంట్ ఇచ్చినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2013లో టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్ శర్మ మొత్తం 67 మ్యాచ్‌ల్లో 116 ఇన్నింగ్స్‌ల్లో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సహాయంతో 4302 పరుగులు చేశాడు.
Also Read : HYDRA : నేటి నుంచి అందుబాటులోకి హైడ్రా పోలీస్ స్టేషన్..