NTV Telugu Site icon

Rinku singh: పెళ్లికి రెడీ అయిన యంగ్ క్రికెటర్.. ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్?

Rinku Singh

Rinku Singh

ఐపీఎల్ హీరో రింకూ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక రోల్ ప్లే చేస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ముచ్చెమటలు పట్టిస్తాడు. ఐపీఎల్ లో అసాధారణ ప్రతిభ కనబర్చి టీమిండియాలో స్థానం సంపాదించాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకునే వారికి, యంగ్ ప్లేయర్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు రింకూ సింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింటా హల్ చల్ చేస్తుంది. అది మరేదో కాదు. రింకూ సింగ్ వివాహానికి సంబంధించింది. త్వరలోనే రింకూ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీతో ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని నెట్టింటా గట్టిగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఎంగేజ్మెంట్, పెళ్లి విషయంపై ఇటు రింకూ సింగ్ కానీ, అటు ప్రియా సరోజ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతకీ ప్రియా సరోజ్ ఎవరనీ నెట్టింటా సెర్చ్ చేస్తున్నారు రింకూ ఫ్యాన్స్. ఇంతకీ ఆమె ఎవరంటే.. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న తుఫానీ సరోజ్ కూతురు ప్రియా సరోజ్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ప్రియా సరోజ్, అతి పిన్న వయసులో లోక్‌సభలో అడుగుపెట్టిన ఎంపీల్లో ఒకరు.