Rinku Singh Father Dead: రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం!
- రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం
- రింకూ తండ్రి ఖచంద్ర కన్నుమూత
- కాలేయ క్యాన్సర్‌తో పోరాడిన ఖచంద్ర
Indian Cricketer Rinku Singh Father Death: భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన చివరి శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఖచంద్ర ఆరోగ్యం ఇటీవల తీవ్రంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి.. చికిత్స అందించారు. క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉండడంతో ఆయన శారీరం సహకరించక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఇటీవల ఖచంద్ర సింగ్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆడుతున్న రింకూ సింగ్.. విషయం తెలుసుకుని ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయాడు. చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందింది. వెంటనే జట్టును విడిచి స్వస్థలానికి వెళ్లాడు. వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఖచంద్ర ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాలేదు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
- Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
- Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
- IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
రింకూ సింగ్ తండ్రి మరణ వార్త తెలిసి క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తండ్రి మరణంతో రింకూ టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆడడం ఇక అనుమానమే. సంజు శాంసన్ తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో దుమ్మురేపిన రింకూ.. టీమిండియాలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టులో ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు.
తాజావార్తలు
-
TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?