RCB vs SRH Playing XI: హై వోల్టేజ్ ఫైట్.. ఆర్సీబీ vs సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11 ఇదే!
- తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ vs ఎస్ఆర్‌హెచ్
- పటిష్టంగా ఆర్‌సీబీ, బలహీనంగా సన్‌రైజర్స్ బౌలింగ్
- ఆర్సీబీ vs సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11 ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs SRH Probable Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఈ సీజన్‌ను ఆరంభించబోతోంది. తొలి మ్యాచ్‌లోనే పటిష్ట టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరగనుంది. ఎన్నో ఏళ్ల తర్వాత తొలి టైటిల్ గెలిచిన ఆర్‌సీబీ.. అదే జోష్‌ను ఈ సీజన్‌లో కొనసాగించాలని చూస్తోంది. 2016లో చివరగా టైటిల్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్.. ఈసారైనా కప్ ముద్దాడాలని భావిస్తోంది. ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ కాబట్టి ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పటిష్టంగా ఆర్‌సీబీ:
ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆపై కెప్టెన్ రాజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ కీలక పాత్ర పోషించనున్నారు. టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. బౌలింగ్‌లో జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో లేకపోవడంతో.. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యపై కీలక బాధ్యతలు ఉన్నాయి. జాకబ్ డఫీ, సుయాష్ శర్మలపై కూడా అంచనాలు ఉన్నాయి.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
బలహీనంగా సన్‌రైజర్స్ బౌలింగ్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ గత సీజన్‌లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఈసారి మంచి ఆరంభం కోసం ఎదురుచూస్తోంది. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడనున్నారు. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి జట్టును నిలబెట్టేందుకు ఉన్నారు. చివర్లో లియామ్ లివింగ్‌స్టోన్ పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగలడు. సన్‌రైజర్స్ బౌలింగ్ వీక్ అనే చెప్పాలి. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, బ్రైడన్ కార్స్, శివమ్ మావిలు ఇటీవల పెద్దగా ఆడిన దాఖలు లేవు. బెంగళూరు బ్యాటర్లను వీరు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.
పిచ్ రిపోర్ట్:
ఎం. చిన్నస్వామి స్టేడియం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ కారణంగా బ్యాటర్లు ఈజీగా షాట్లు ఆడగలరు. ఫాస్ట్ బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్లు బంతిని నెమ్మదిగా వేస్తూ టర్న్ సాధిస్తేనే విజయవంతమవుతారు. భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు జట్లు బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన పోరుగా మారనుంది.
ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ.
హైదరాబాద్: హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అన్మోల్ వర్మ, నితీష్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, బ్రైడన్ కార్స్, శివమ్ మావి.
తాజావార్తలు
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!