IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
- జింబాబ్వే పర్యటన కోసం భారత టీ20 జట్టు ప్రకటన
- మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్
- ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Squad Selection Debate: జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో కొన్ని ఎంపికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున రాణించిన కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఐపీఎల్లో పెద్దగా రాణించని ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టులో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు చోటు దక్కలేదు. పాటిదార్ 2026 ఐపీఎల్ సీజన్లో 501 పరుగులు చేశాడు. అతను 41.75 బ్యాటింగ్ సగటు, 192.69 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. అలాగే టోర్నమెంట్లో 42 సిక్సర్లు బాదాడు. సీనియర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, యువ పేసర్ రసిఖ్ సలామ్‌లకు కూడా ఛాన్స్ రాలేదు. కృనాల్ 45.0 సగటుతో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు పడగొట్టాడు. రసిఖ్ 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. 21.32 సగటు, 9.46 ఎకానమీ రేటుతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ.. మహిళల క్రికెట్‌కు చిరునామా.. చరిత్రలోనే గొప్ప ఆల్‌రౌండర్!
- Vaibhav Sooryavanshi Debut: వైభవ్‌కు ఒకటే చెప్పాం.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
- Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
మరోవైపు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌కు భారత జట్టులో అవకాశం లభించింది. ఐపీఎల్ 2026లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేదు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున 4 మ్యాచ్‌లలో ఆడినప్పటికీ.. ఒక్క వికెట్ పడగొట్టలేదు. సుమారు 12 ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లను బీసీసీఐ పక్కన పెడుతోంది అని అంటున్నారు. మయాంక్ యాదవ్‌కు ఏ ప్రాతిపదికన చోటు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
-
Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
ట్రెండింగ్
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!